
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా తాడో పేడో తేల్చుకోవడానికిసిద్దమైంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పనిసారిగా ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలి. కాగా పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చెందింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ప్రోటిస్ జట్టు ముందుంజలో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వివాదస్పద వాఖ్యలు చేశాడు. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయని అతడు పేర్కొన్నాడు.
“భారత డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విభజించబడిందని మనకు సృష్టంగా తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డే సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వేరువేరుగా కూర్చున్నారు. అలాగే, కోహ్లి కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఉన్న ఉన్న జోష్.. ప్రస్తుతం అతడిలో లేదు. కానీ విరాట్ టీమ్ మ్యాన్.. మరింత బలంగా తిరిగి వస్తాడు అని కనేరియా పేర్కొన్నాడు. కాగా టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment