లాహోర్: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. లాక్‌డౌన్‌లో ప్రపంచ దేశాల క్రికెటర్లంతా తమ ఇంట్లోనే సరదా సరదాగా గడుపుతుంటే పాకిస్తాన్ క్రికెట్‌లో మాత్రం ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటూ విమర్శించుకుంటున్నారు. అంతకుముందు పాక్ దిగ్గజాలైన ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మండిపడిన సంగతి తెలిసిందే. జావేద్ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడానికి ఇమ్రాన్, అక్రమ్‌లు కుట్ర చేశారంటూ బాసిత్ అలీ ధ్వజమెత్తగా, తాజాగా మరో ఇద్దరు పాక్ మాజీ క్రికెటర్లైన డానిష్ కనేరియా, ఫైజల్ ఇక్బాల్‌ల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో 2006లో ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ కారణమైంది. వీరి మధ్య వాగ్వాదానికి మాత్రం పరోక్షంగా ఇంజమాముల్ హక్ కారణమయ్యాడు.(అది ఇమ్రాన్, అక్రమ్‌ల కుట్ర..!)
వివరాల్లోకి వెళితే.. 2006 ముల్తాన్ టెస్ట్‌లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. కనేరియా బౌలింగ్‌లో విరుచుకుపడిన వీడియోను ఇంజమాముల్ హక్ పోస్ట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కనేరియాపై లారా పూర్తి ఆధిపత్యం చెలాయించాడని హక్ పేర్కొన్నాడు. దీనికి స్పందించిన కనేరియా..తాను ఐదుసార్లు లారాను అవుట్ చేశానని, పీసీబీ మద్దతుగా నిలిస్తే తాను ఎన్నో రికార్డులు కొల్లగొట్టేవాడినని చెప్పుకొచ్చా డు. అయితే దీనికి స్పందించిన ఫైసల్ ఇక్బాల్.. లారాని స్లెడ్జింగ్ చేయబోయి అభాసుపాలయ్యాడని, బ్రియాన్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే కనేరియా ప్రేక్షకుడిగా మిగిలిపోయాడని ఎద్దేవాచేశాడు. దీనికి ఘాటుగా బదులిచ్చిన కనేరియా ‘ఫైసల్‌లాంటి క్రికెటర్ నాపై వ్యాఖ్యలు చేయడమా. మొదట నీ స్థాయి ఏపాటిదో తెలుసుకో’ అని సూచించాడు. దాంతో ఇక్బాల్ చిర్రెత్తుకొచ్చింది. ‘నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్. నువ్వు ఎటువంటి విలువలు లేని క్రికెటర్‌వి. నేను నీలాగ దేశాన్ని అమ్మేయలేదు’ అని ఇక్బాల్ ఘాటగా బదులిచ్చాడు.(‘ఆ రోజు పంత్‌ను ఆపడం ఎవరితరం కాదు’)
Comments
Please login to add a commentAdd a comment