కరాచీ: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది. అక్కడ ప్రజలు సైతం కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. ప్రపంచమంతా లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో ఆకలి బాధ తీర్చుకోవడం కూడా కష్టమై పోయింది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు పోవడం సంగతి అటుంచితే, ఆకలితో అల్లాడిపోయేవారు వేలల్లో ఉన్నారు. అది పాకిస్తాన్‌లో ఎక్కువగా ఉంది. దీనిలో భాగంగా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి తన ఫౌండేషన్ ద్వారా సాయం చేయాలని పాక్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది ముందుకొచ్చాడు. దీనిలో భాగంగా తన ఫౌండేషన్ ద్వారా మందులు, ఆహారం అందిస్తున్నాడు. (అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్)
అయితే 'ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా పేదవారు, రెక్కాడితే గాని డొక్కాడని వారి కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనంత సాయం చేద్దాం. అఫ్రిదీ ఫౌండేషన్‌కు నా మద్దతు ఉంటుంది. కరోనాపై పోరాటంలో అతడి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. అఫ్రిది పౌండేషన్‌కు విరాళాలు ఇవ్వండి' అని యూవీ, భజ్జీ విజ్ఞప్తి చేశారు. ఇది కొంతమంది భారత అభిమానులకు నచ్చలేదు. దాంతో యువీ, భజ్జీలపై విమర్శలకు దిగారు మానవత్వం కంటే ఏది ఎక్కువ కాదని వీరిద్దరూ కౌంటర్ ఇవ్వడంతో ఒక వర్గం ఫ్యాన్స్ కాస్త శాంతించారు.
పాక్‌లో మైనార్టీలకు మీ సాయం అవసరం
ఇప్పుడు తాజాగా మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానేష్ కనేరియా కూడా యువరాజ్, హర్భజన్‌ల సింగ్‌ల సాయం కోరాడు. పాక్‌లో ఉన్న మైనార్టీలకు యువీ, భజ్జీలు సాయం చేయాలని విన్నవించాడు. మైనార్టీ అయిన కనేరియా.. ఇంతటి క్లిష్ట సమయంలో మా దేశంలోని మైనార్టీలకు యువీ, భజ్జీల సాయం అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక వీడియో రూపంలో యువీ, భజ్జీల సాయాన్ని అభ్యర్థించాడు. హిందూ మతస్థుడైన కనేరియా.. పాక్ తరఫున ఆడే రోజుల్లో వివక్షకు గురయ్యాడు. ఈ విషయం ఇటీవల షోయబ్ అక్తర్ బయటపెట్టాడు. తమ దేశ క్రికెటర్లు కనేరియాను చాలా చిన్నచూపు చూసేవారంటూ స్పష్టం చేశాడు. దీనిపై కనేరియా అవుననే సమాధానం ఇచ్చినా, అక్కడ మైనార్టీ కావడంతో దీన్ని పెద్ద విషయం చేయకుండా వదిలేశాడు. తనపై విధించిన సస్పెన్షన్ విషయంలో కూడా పీసీబీ న్యాయం చేయలేదని గతంలో కనేరియా పేర్కొన్నాడు. ఫిక్సింగ్‌కు పాల్పడిన చాలామంది పాకిస్తాన్ క్రికెటర్లపై నిషేధం ఎత్తివేసిన పీసీబీ.. తాను మైనార్టీ కావడం వల్లే వివక్ష చూపిస్తుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment