
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో హార్దిక్ సేన సమం చేసింది. ఇక ఫిబ్రవరి1న సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో ఆహ్మదాబాద్ వేదికగా తాడోపేడో తెల్చుకోవడానికి బారత్-కివీస్ జట్లు సిద్దమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కివీస్‌తో మూడో టీ20కు శుబ్‌మన్ గిల్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను జట్టులో తీసుకురావాలని కనేరియా సూచించాడు. కాగా టెస్టుల్లో, వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న గిల్.. టీ20ల్లో మాత్రం దారుణంగా విఫలమవతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గిల్ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.
అతడు అద్భుతాలు సృష్టిస్తాడు..
ఈ క్రమంలో కనేరియా యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ఈ సిరీస్ చివరి దశకు చేరింది. కీలకమైన మూడో మ్యాచ్‌కు గిల్‌ను పక్కన పెడితే బాగుంటుంది. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడి ఆట తీరు ఎంటో చూశం. గిల్ టీ20లకు సెట్ కాడు. అలా అని గిల్‌ను నేను తక్కువ చేసి మాట్లాడనట్లు కాదు.
గిల్ కూడా అద్భుతమైన ఆటగాడు. కానీ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. కాబట్టి అతడి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఓపెనర్‌గా పంపండి. అతడు అద్భుతమైన ఆటగాడు. పవర్ ప్లే అటాకింగ్ గేమ్ ఆడగలడు. పృథ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇస్తే.. అద్భుతాలు సృష్టిస్తాడు అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా..
IND vs NZ: వన్డేల్లో హిట్.. టీ20ల్లో ఫట్! గిల్‌కు ఏమైంది? ఇకనైనా అతడిని..