Ind vs NZ: Subhaman Gill Flop Show Contuines in T20s - Sakshi
Sakshi News home page

IND vs NZ: వన్డేల్లో హిట్‌.. టీ20ల్లో ఫట్‌! గిల్‌కు ఏమైంది? ఇకనైనా అతడిని..

Published Mon, Jan 30 2023 11:52 AM | Last Updated on Mon, Jan 30 2023 12:22 PM

Subhaman Gill Flop Show Contuines in T20s - Sakshi

Shubman Gill In T20Is: టెస్టు, వన్డేల్లో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ .. టీ20ల్లో మాత్రం తనదైన మార్క్‌ చూపించడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 15.2 సగటుతో కేవలం 72 పరుగులు మాత్రమే సాధించాడు. అందులో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 46 పరుగులు. గతేడాది ఆఖర్లో శ్రీలంకపై టీ20ల్లో గిల్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

మారని తీరు
తొలి మ్యాచ్‌లోనే శుబ్‌మన్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ నిరాశపరిచాడు. ఇక తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో భాగంగా ఉన్న గిల్‌ అదే తీరును కొనసాగిస్తున్నాడు.

సెట్‌ అవ్వడు!
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ కేవలం 18 పరుగులు చేశాడు. రాంఛీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 పరుగులు చేసిన శుబ్‌మన్‌.. లక్నోలో జరిగిన రెండో టీ20లో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గిల్‌ కేవలం టెస్టులకు, వన్డేలకు మాత్రమే సెట్‌ అవుతాడని, టీ20లకు సరిపోడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

పృథ్వీ షాను తీసుకురండి
మరి కొంత మంది టీ20ల్లో గిల్‌ స్థానంలో మరో యువ ఓపెనర్‌ పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మూడో టీ20కు గిల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో పృథ్వీ షా తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా న్యూజిలాండ్‌ భారత మధ్య కీలకమైన మూడో టీ20 ఫిబ్రవరి1న జరగనుంది.
చదవండి: ENG vs SA 2nd ODI: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్‌ సొంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement