‘జరిమానా’కి సాయం కావాలి
పాకిస్తాన్ స్పిన్నర్ డానెష్ కనేరియా గుర్తున్నాడుగా... ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్నాడు. తాను ఫిక్సింగ్ చేయలేదని ఇంగ్లండ్‌లో కోర్టును ఆశ్రయించి గతంలో భంగపడ్డాడు. ఫిక్సింగ్ చేసినందుకు, తమను కోర్టుకు పిలిచినందుకు ఖర్చులకు గాను అన్నీ కలిపి కనే రియా తమకు రూ. 2.5 కోట్లు చెల్లించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. అయినా స్పందించకపోవడంతో లాహోర్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కనేరియా దీనిపై భిన్నంగా స్పం దించాడు. తనకు పాకిస్తాన్ బోర్డు సాయం చేయాలని కోరాడు. ఎవరైనా న్యాయ పోరాటం చేస్తాను సాయం చేయమని కోరాలి. కానీ కనేరియా జరిమానా కట్టడానికి సాయం చేయమని కోరుతున్నాడు. ఇదేం చిత్రమో మరి.