ICC ODI Rankings: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రన్‌మెషీన్.. మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకు సాధించాడు. అదే విధంగా ప్రపంచకప్ మ్యాచ్‌లలో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్, ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ సైతం తమ స్థానాలు మెరుగుపరుచుకున్నారు.
ఇక వన్డే వరల్డ్ నంబర్ 1 బ్యాటర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్, ఐర్లాండ్ స్టార్ హ్యారీ టెక్టార్, ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్-5లో కొనసాగుతున్నారు.
ఏడు స్థానాలు ఎగబాకి
కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ సెంచరీ చేయగా.. కోహ్లి ఆసీస్‌తో మ్యాచ్‌లో 85 పరుగులు సాధించాడు. వీరిద్దరు వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. మరోవైపు.. ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం(140)తో విరుచుకుపడి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.
రాహుల్ ర్యాంకు ఎంతంటే
ఇదిలా ఉంటే.. టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ 15 స్థానాలు మెరుగుపరచుకుని.. 19వ ర్యాంకులో నిలిచాడు. సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన భారత్‌ను సిక్సర్‌తో విజయతీరాలకు చేర్చాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మరోవైపు.. గిల్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమై నంబర్ 1గా అవతరించే అవకాశం చేజార్చుకున్నాడు.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే
1. బాబర్ ఆజం(పాకిస్తాన్)
2. శుబ్‌మన్ గిల్(భారత్)
3. రాసీ వాన్ డెర్ డసెన్(సౌతాఫ్రికా)
4. హ్యారీ టెక్టర్(ఐర్లాండ్)
5. డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా).
చదవండి: ఈ వరల్డ్‌కప్‌లోనే కోహ్లి.. సచిన్ సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడు!
Comments
Please login to add a commentAdd a comment