ICC Cricket World Cup 2023- India vs Australia- Virat Kohli: ఓపెనర్లు డకౌట్.. అందులోనూ ఓ గోల్డెన్ డక్.. నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటర్ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు! సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా దుస్థితి ఇది.
చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్.. బౌలర్ల విజృంభణతో ప్రత్యర్థిని 199 పరుగులకే కట్టడి చేయగలిగింది. దీంతో స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఈజీగా ఊదేస్తుందంటూ అభిమానులు పండుగ చేసుకున్నారు.
ముగ్గురు డకౌట్
కానీ ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. స్టార్క్ ఇషాన్‌ను పెవిలియన్‌కు పంపితే.. రోహిత్‌ను హాజిల్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌ను సైతం పెవిలియన్ పంపాడు.
కోహ్లి, రాహుల్‌పై భారం
2 పరుగులకే.. 3 వికెట్లు.. అసలు ఆడుతోంది టీమిండియానే అన్న అనుమానం.. ఇలాగైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పైనే భారమంతా!
అద్భుత షాట్‌తో
ఇలాంటి సమయంలో.. కోహ్లి కొన్ని అద్భుత షాట్లతో అలరించాడు. ఆరో ఓవర్ ఐదో బంతికి.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గ్లోరియస్ ఫోర్‌తో దుమ్ములేపాడు. తర్వాత మళ్లీ పదకొండో ఓవర్ వరకు టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు.
మినీ హార్ట్ ఎటాక్
ఇదిలా ఉంటే.. డేంజరస్ బ్యాటర్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్ మార్ష్ మిస్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇండియా ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన హాజిల్‌వుడ్ కోహ్లికి షార్ట్‌బాల్‌ను సంధించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది.
మూల్యం చెల్లించకతప్పదు
మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ సహా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చారు. మార్ష్ బాల్‌ను క్యాచ్ చేసినట్లే చేసి.. పట్టుతప్పి బంతిని జారవిడిచాడు. దీంతో టీమిండియా శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘‘ఈ క్యాచ్ డ్రాప్ చేసి మ్యాచ్‌ను కూడా ఆసీస్ డ్రాప్ చేసుకుంది. ఏదేమైనా మినీ హార్ట్‌టాక్ అనుకోండి. కింగ్ భయపెట్టేశావు పో! ఈ తప్పిదంతో ఆసీస్ భారీ మూల్యం చెల్లించకతప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: WC 2023: ఆనందం కాసేపే! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్.. నీకెందుకు?
Comments
Please login to add a commentAdd a comment