వన్డే ప్రపంచకప్-2023ను టీమిండియా విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది.
ఈ సమయంలో విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి కంటే రాహుల్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
"కేఎల్ రాహల్ బ్యాటింగ్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో కాకుండా వేరే లీగ్ క్రికెట్‌లో ఆడినట్లు అన్పించింది. విరాట్ కోహ్లి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ విరాట్‌కు ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ రూపంలో ఓ అవకాశం ఇచ్చారు.
విరాట్ కోహ్లి క్యాచ్ మాత్రం టర్నింగ్ పాయింట్. కాగా రాహుల్ మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అవసరమైనప్పుడు షాట్లు ఆడుతూ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రాహుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు సహకారం అందిస్తూ ఉంటాడు. అతడికి ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది.
అదే విధంగా వికెట్ కీపింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అందరూ కోహ్లి ఫిట్‌నెస్‌ను, వికెట్ల మధ్య అద్భుతంగా పరిగెడతాడని అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ రాహుల్ కూడా అతడితో పాటు పరిగెత్తున్నాడు. అదే విధంగా 50 ఓవర్లపాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి రాహుల్ వంటి ఆటగాడికి అందరూ సపోర్ట్ చేయాలని" తన యూట్యూబ్ ఛానల్‌లో అక్తర్ పేర్కొన్నాడు.
చదవండి: CWC 2023 ENG vs BAN: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లండ్.. 364 పరుగుల భారీ స్కోర్
Comments
Please login to add a commentAdd a comment