
ICC Women's T20I: ఐసీసీ టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ షఫాలీ వర్మ అదరగొట్టింది. తాజాగా ప్రకటించిన బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో షఫాలీ 726 పాయింట్లతో తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో టీమిండియా ప్లేయర్ స్మృతి మంధాన మాత్రం 709 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ బెత్‌మూనీ 724 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
చదవండి: Gautam Gambhir: వెంకటేశ్ అయ్యర్‌కు వన్డే క్రికెట్ ఆడే మెచ్యూరిటీ లేదు..
ఇక ఇంగ్లండ్‌తో హోమ్ సిరీస్‌లో తొలి టి20లో 64 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెగ్ లానింగ్ 714 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ తాహిలా మెక్‌గ్రాత్ 91 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో ర్యాంకింగ్స్‌లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది. ఇక శ్రీలంక బ్యాటర్ చమేరీ ఆటపట్టు అటు బ్యాటింగ్.. ఇటు ఆల్‌రౌండ్ విభాగంలో టాప్‌టెన్‌లో నిలవడం విశేషం. బ్యాటింగ్‌లో 8వ స్థానంలో నిలిచిన చమేరీ.. ఆల్‌రౌండర్ విభాగంలో ఏడో స్థానంలో ఉంది. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో 370 పాయింట్లతో తొలిస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సీవర్ 352 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
చదవండి: కేశవ్ మహరాజ్ 'జై శ్రీరామ్'.. అభిమానుల ప్రశంసల వర్షం
🔹 Shafali Verma back on 🔝
— ICC (@ICC) January 25, 2022
🔹 Big gains for Chamari Athapaththu 🙌
Here are the movements in this week's @MRFWorldwide ICC Women's Player Rankings 📈
Details 👉 https://t.co/vgKLeRzB8D pic.twitter.com/Eh6A9fi7bj