Shafali Verma And Smrithi Mandhana ICC T20 Rankings.. ఐసీసీ మంగళవారం ప్రకటించిన టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ(726 పాయింట్లు) టాప్ ప్లేస్‌ను చేజార్చుకొని రెండో స్థానానికి పరిమితం కాగా.. మరో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన(709 పాయింట్లు) మాత్రం తన మూడో స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఆస్ట్రేలియా వుమెన్ బ్యాటర్ బెత్ మూనీ 754 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆసీస్‌కే చెందిన మెగ్ లానింగ్(698 పాయింట్లు), సోఫీ డివైన్( 692 పాయింట్లు), అలెసా హేలీ(673 పాయింట్లు)లు వరుసగా 4,5,6 స్థానాల్లో నిలిచారు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఐదుగురు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఉండడం విశేషం.
ఇక బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్కిల్‌స్టోన్ 771 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సారా గ్లెన్(ఇంగ్లండ్, 744 పాయింట్లు) రెండో స్థానంలో.. షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా, 718 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ 370 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి దీప్తి శర్మ 315 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం
T20 World Cup: రషీద్ ఖాన్ టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే!
We have a new No. 1 in town 👏
— ICC (@ICC) October 12, 2021
Plenty of movement in this week's @MRFWorldwide ICC Women's T20I Player Rankings 📈
More 👉 https://t.co/9r1AQ9zGSu pic.twitter.com/o0U1hEYJ1T
Comments
Please login to add a commentAdd a comment