batting ranks
-
ICC: అగ్రపీఠానికి చేరువైన రూట్.. భారీ జంప్ కొట్టిన బ్రూక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు సత్తా చాటారు. వెటరన్ క్రికెటర్ జో రూట్ అగ్రస్థానానికి చేరువకాగా.. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. బెన్ డకెట్ ఆరు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-20(16వ ర్యాంకు)లో అడుగుపెట్టగా.. ఓలీ పోప్ 8 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.విండీస్‌ను చిత్తు చేసిమూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం వెస్టిండీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 241 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఈ విజయంలో జో రూట్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో 32వ టెస్టు సెంచరీ(122 రన్స్) నమోదు చేశాడు. ఫలితంగా 12 రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకున్న జో రూట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.అగ్రపీఠానికి చేరువైన రూట్నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ పీఠంపై కన్నేశాడు. మరో ఏడు రేటింగ్ పాయింట్లు సాధిస్తే రూట్ అగ్రస్థానానికి ఎగబాకుతాడు. విండీస్‌తో మిగిలి ఉన్న మూడో టెస్టులోనూ సత్తా చాటితే ఇదేమంత కష్టం కాదు.భారీ జంప్ కొట్టిన బ్రూక్ఇక 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ సైతం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ(109)తో కదంతొక్కాడు. ఈ క్రమంలో నాలుగు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌లను వెనక్కి నెట్టి టాప్-3లోకి దూసుకువచ్చాడు.కాగా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ(7వ ర్యాంకు), అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(8వ ర్యాంకు), విరాట్ కోహ్లి(10వ ర్యాంకు) టాప్-10లో కొనసాగుతున్నారు.ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు2. జో రూట్(ఇంగ్లండ్)- 852 రేటింగ్ పాయింట్లు3. హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 771 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు5. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు. -
ICC Rankings: స్థానం దిగజారిన షఫాలీ వర్మ.. స్మృతి మంధన మాత్రం
Shafali Verma And Smrithi Mandhana ICC T20 Rankings.. ఐసీసీ మంగళవారం ప్రకటించిన టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ(726 పాయింట్లు) టాప్ ప్లేస్‌ను చేజార్చుకొని రెండో స్థానానికి పరిమితం కాగా.. మరో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన(709 పాయింట్లు) మాత్రం తన మూడో స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఆస్ట్రేలియా వుమెన్ బ్యాటర్ బెత్ మూనీ 754 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆసీస్‌కే చెందిన మెగ్ లానింగ్(698 పాయింట్లు), సోఫీ డివైన్( 692 పాయింట్లు), అలెసా హేలీ(673 పాయింట్లు)లు వరుసగా 4,5,6 స్థానాల్లో నిలిచారు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఐదుగురు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఉండడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్కిల్స్టోన్ 771 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సారా గ్లెన్(ఇంగ్లండ్, 744 పాయింట్లు) రెండో స్థానంలో.. షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా, 718 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ 370 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి దీప్తి శర్మ 315 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం T20 World Cup: రషీద్ ఖాన్ టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే! We have a new No. 1 in town 👏 Plenty of movement in this week's @MRFWorldwide ICC Women's T20I Player Rankings 📈 More 👉 https://t.co/9r1AQ9zGSu pic.twitter.com/o0U1hEYJ1T — ICC (@ICC) October 12, 2021 -
నా శైలిని మార్చుకోను
మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం కాకుండా ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు జరిగిన మరో మేలు ఒక సంచలన బ్యాటర్ వెలుగులోకి రావడం. 16 ఏళ్ల వయసులోనే దాదాపుగా ప్రపంచకప్‌ను గెలిపించాల్సిన పెను భారాన్ని ఆ అమ్మాయి మోసింది. దురదృష్టవశాత్తూ టైటిల్ నెగ్గకపోయినా మన మహిళల క్రికెట్ భవిష్యత్ భద్రంగా ఉందన్న ధైర్యం కలిగిందంటే ఆమె ఇచ్చిన ప్రదర్శనే కారణం. ఇదంతా హరియాణా టీనేజర్ షఫాలీ వర్మ గురించే. తన దూకుడైన ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె కూడా మున్ముందు మరింతగా దూసుకుపోవాలని పట్టుదలగా ఉంది. సాక్షి క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 158.25 స్ట్రయిక్ రేట్‌తో 163 పరుగులు చేసింది. ఫైనల్లో షఫాలీ వైఫల్యం భారత జట్టు తుది ఫలితంపై బలంగా పడిందంటే టోర్నీలో ఆమె ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఐపీఎల్ సమయంలో జరిగిన ఉమెన్ చాంపియన్స్ టి20 టోర్నీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ ఏడాది తిరిగేలోగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. రాబోయే రోజుల్లోనూ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్న షఫాలీ తన కెరీర్‌కు సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే.... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై... నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ దాకా చేరడం సంతోషకరమే అయినా మున్ముందు కఠిన పరీక్షా సమయం ఉంది. అయితే నాకు ఎదురయ్యే ఎలాంటి సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచేలా ప్రయత్నించడం, వాటిలో నేనూ కీలక పాత్ర పోషించడమే ప్రస్తుతానికి నా దృష్టిలో లక్ష్యాలు. వరల్డ్‌కప్ ఫైనల్ ఫలితంపై... ఆ రోజు మాకు కలిసి రాలేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే. మేం ఒడిసిపట్టుకొని విజయాన్ని అందుకొనే మరిన్ని అవకాశాలు మున్ముందు వస్తాయి. ఫలితం వచ్చేశాక దానిని మనం మార్చలేం కానీ భవిష్యత్‌లో ఏం చేయాలో మా చేతుల్లోనే ఉంది. తన వ్యక్తిగత ప్రదర్శనపై... క్రీజ్‌లోకి అడుగు పెట్టాక వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే నా బాధ్యత. ఎందరో ప్రముఖులు నా ప్రదర్శనను ప్రశంసించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అయితే ట్రోఫీ గెలిచి ఉంటే ఇది మరింత అద్భుతంగా ఉండేది. జట్టులో వాతావరణంపై... చాలా బాగుంటుంది. సీనియర్లే మాట్లాడాలని, జూనియర్లు వారు చెప్పింది వినాలని అస్సలు ఉండదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతిలాంటి సీనియర్లయితే నన్ను మరింతగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక డబ్ల్యూవీ రామన్ సర్ రూపంలో అద్భుతమైన కోచ్ మాకు ఉన్నారు. ఎలాంటి సమస్య గురించి చెప్పినా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. తన మార్గనిర్దేశనంతో మనలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపగలరు. స్మృతితో ఓపెనింగ్‌పై... మేం అతిగా ఆలోచించం. ఇద్దరం సహజసిద్ధమైన ఆటనే ఆడేందుకు ప్రయత్నిస్తాం. కాస్త తేలికైన బంతి పడిందంటే చాలు చితక్కొట్టడమే. దానిపై మరో ఆలోచన లేదు. ఈ విషయంలో ఇద్దరం ఒకే తరహాలో ఆలోచిస్తాం. ఇక మంచి బంతులు వస్తే సింగిల్స్‌పై దృష్టి పెడతాం. సహజసిద్ధమైన ఆటను ఆడటంలో ఉండే సౌకర్యం మరోదాంట్లో రాదు. దానిని మార్చాలని ప్రయత్నిస్తే అది పని చేయదని నా నమ్మకం. కరోనాతో వచ్చిన విరామంపై... నా ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం కూడా ఎంతో కీలకం. దీనికి సంబంధించి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక ఒక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీతో ఒప్పందం కుదరడం వల్ల ఆర్థికపరంగా నేను ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండగలుగుతున్నా. ఎన్నో కష్టాలకోర్చి నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన మా నాన్నపై కూడా ఇప్పుడు ఆ భారం తగ్గింది. -
ఎనిమిదో స్థానానికి ధోని
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ మెల్బోర్న్: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండు స్థానాలు ఎగబాకాడు. 10నుంచి అతను 8వ స్థానానికి చేరుకున్నాడు. డివిలియర్స్ టాప్‌లో కొనసాగుతున్న ఈ జాబితాలో విరాట్ కోహ్లి (4), ధావన్ (7) తమ స్థానాలు నిలబెట్టుకోగా రైనా 20నుంచి 17కు చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత్‌నుంచి టాప్-10లో ఎవరూ లేరు. మొహమ్మద్ షమీ 11వ స్థానంలో ఉండగా, అశ్విన్ (16), భువనేశ్వర్ (17), జడేజా (18) టాప్-20లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ జాబితాలో జడేజాకు 7వ స్థానం దక్కింది.