
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో 121 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. 124 పాయింట్లతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్ మూడు, న్యూజిలాండ్ నాలుగు, వెస్టిండీస్ అయిదో స్థానంలో నిలిచాయి.
వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో 824 పాయింట్లతో నంబర్ వన్‌గా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం కారణంగా లంకతో సిరీస్ ఆడలేదు. దీంతో 48 పాయింట్లు కోల్పోయి 776 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఫించ్ (784 పాయింట్లు), విండీస్ ఆటగాడు ఎవిన్ లూయీస్ (780) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment