
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో లోకేశ్ రాహుల్ టాప్ –10లోకి చేరాడు. ఆసీస్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో రాణించిన రాహుల్.. గురువారం విడుదలైన టీ20 ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ జాబితాలో 726 పాయింట్లతో ఆరో ర్యాంకు పొందాడు. రాహుల్ మినహా టాప్–10లో ఒక్క భారత బ్యాట్స్‌మెన్ కూడా లేరు. రోహిత్ 12వ, ధవన్ 15వ, కోహ్లీ 17వ, సీనియర్ ఆటగాడు ధోని 56వ స్థానాల్లో ఉన్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో వీరవిహారం చేసిన ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజాయ్ ఏకంగా 31 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల విభాగంలో బుమ్రా 12, కృనాల్ 18 ర్యాంకులు ఎగబాకి వరుసగా 15, 43వ ర్యాంకులు పొందారు. కుల్‌దీప్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 4వ ర్యాంకుకు చేరాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయినప్పటికీ టీమ్ విభాగంలో భారత్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆసీస్ మూడో ర్యాంకుకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment