
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. షఫాలీ వర్మ ఆరో స్థానానికి పడిపోగా... జెమీమా ఏడు స్థానాలు ఎగబాకి తొమ్మిది నెలల తర్వాత మళ్లీ పదో ర్యాంక్‌లో నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ లానింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ కొనసాగుతున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేస్ బౌలర్ రేణుక సింగ్ పది స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్‌ను అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment