Virat Kohli Out From Top 10 ICC T20 Batting Rankings.. ఐసీసీ బుధవారం టి20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్కడే టాప్-5 లో నిలిచాడు. ఇక టి20 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్-10 నుంచి ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో రోహిత్, రాహుల్ మంచి ప్రదర్శన కనబరిచారు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 80 పరుగులు చేశాడు. దీంతో తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకొని 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్
ఇక సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 809 పాయింట్లతో టాప్ స్థానాన్ని కాపాడుకోగా.. 805 పాయింట్లతో డేవిడ్ మలాన్(ఇంగ్లండ్) రెండో స్థానంలో.. దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్రమ్ 796 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 735 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ చాలా రోజుల తర్వాత టాప్‌టెన్‌లో చోటు సంపాదించాడు. గప్టిల్ 658 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు.
బౌలింగ్ విభాగంలో వనిందు హసరంగ(శ్రీలంక) 797 పాయింట్లతో తొలి స్థానం.. తబ్రెయిజ్ షంసీ(దక్షిణాఫ్రికా) 784 పాయింట్లతో రెండో స్థానం.. ఆడమ్ జంపా(ఆస్ట్రేలియా) 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో టాప్‌టెన్‌లో ఒక్కరు కూడా లేరు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ(అప్గానిస్తాన్).. 265 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్).. 231 పాయింట్లతో రెండో స్థానంలో.. లియామ్ లివింగ్‌స్టోన్( ఇంగ్లండ్).. 179 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.
చదవండి: Ravichandran Ashwin: ఫైనల్ తర్వాత ఇప్పుడే మళ్లీ.. అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు!
Comments
Please login to add a commentAdd a comment