రెండో స్థానంలోనే భారత్ | india second place in ICC T20 rankings | Sakshi
Sakshi News home page

రెండో స్థానంలోనే భారత్

Published Sat, Mar 8 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

india second place in ICC T20 rankings

ఐసీసీ టి20 ర్యాంకింగ్స్
 దుబాయ్: భారత జట్టు గత కొన్నాళ్లుగా టి20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడకపోయినా రెండో ర్యాంకును మాత్రం నిలబెట్టుకుంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ 123 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా కూడా భారత్‌తో సమానంగా పాయింట్లు కలిగివున్నా దశాంశ స్థానాల తేడాతో మూడో ర్యాంకుకు పరిమితమైంది.

 శ్రీలంక 129 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఈ నెల 16 నుంచి జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ముందు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనున్న నేపథ్యంలో ఆయా జట్ల ర్యాంకులు మారే అవకాశాలున్నాయి. ఇక వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ కోహ్లి, రైనా, యువరాజ్‌లు వరుసగా నాలుగు, ఐదు, ఆరో ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబి తాలో యువీ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement