ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ అదరగొట్టింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మూనీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. కామన్‌వెల్త్ గేమ్స్ క్రికెట్‌లో 179 పరుగులతో మూనీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్‌పై 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ.. పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై పై 70, 36 పరుగులతో రాణించింది.
దీంతో రెండో స్థానంలో ఉన్న ఆమె 743 పాయింట్లతో ఆసీస్ కెప్టెన్ లానింగ్‌ను వెనుక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. కాగా మూనీ ఇప్పటి వరకు తన టీ20 కెరీర్‌లో మూడో సారి నెం1 ర్యాంక్ సాధించడం గమనార్హం. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ తహిలియా మెక్‌గ్రాత్ తన కెరీర్‌లో అత్యత్తుమ ర్యాంక్ సాధించింది.
కామన్‌వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన మెక్‌గ్రాత్.. తన కెరీర్‌లో తొలి సారి ఐదో స్థానానికి చేరుకుంది. ఆదే విధంగా భారత బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా తొలి సారి 10వ ర్యాంక్ సాధించింది. ఇక ఓవరాల్‌గా టాప్ ర్యాంక్‌లో బ్రెత్ మూనీ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ లానింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ కొనసాగుతున్నారు.
చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. డీకే, అశ్విన్ వద్దు! అతడు ఉంటేనే బెటర్!
Comments
Please login to add a commentAdd a comment