Aiden Markram Career Best ICC T20 Rankings.. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ సత్తా చాటాడు. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 40, 51* రాణించిన మార్క్రమ్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 743 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకొని కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. ఇక పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా తన కెరీర్ బెస్ట్ సాధించాడు.
చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా
టీమిండియాతో మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 33 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్ మూడుస్థానాలు ఎగబాకి 727 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. డేవిడ్ మలాన్ 831 పాయింట్లతో తన నెంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోగా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 820 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ ర్యాంకులు దిగజారాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి అర్థసెంచరీ సాధించినప్పటికి ఒకస్థానం దిగజారి 725 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి 684 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. భారత బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ 750 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానంలో ఉండగా.. శ్రీలంక బౌలర్ వనిందు డిసిల్వా(726 పాయింట్లు), అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(720 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం
⚡ Big gains for Aiden Markram, JJ Smit
— ICC (@ICC) October 27, 2021
🔥 Mohammad Rizwan rises to No.4 among batters
All you need to know about the latest rankings 👉 https://t.co/1sQBCW4KB0 pic.twitter.com/WfPp8XBb5I
Comments
Please login to add a commentAdd a comment