ఐసీసీ టి20 ర్యాంకుల్లో భారత్ ఒక స్థానం మెరుగు పర్చుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా
దుబాయ్: ఐసీసీ టి20 ర్యాంకుల్లో భారత్ ఒక స్థానం మెరుగు పర్చుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా ఇంగ్లండ్‌పై 2–1తో సిరీస్ గెలవడం ద్వారా రెండో ర్యాంక్‌కు ఎగబాకింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసిన టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో కోహ్లి నిలకడగా అగ్రస్థానంలోనే ఉన్నాడు. టి20 బౌలర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకులోనే ఉండగా, అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.