Asia Cup 2022 IND VS HK: ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచిన విషయం తెలసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్, సూర్య భాయ్ నాటు కొట్టుడు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిస్తే.. భారత ఇన్నింగ్స్ అనంతరం కోహ్లి చేసిన ఓ పనికి యావత్ క్రికెట్ ప్రపంచం పులకించి పోయింది.
తన కంటే చాలా జూనియర్ అయిన సూర్యకుమార్ పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన కోహ్లి.. ఇన్నింగ్స్ అనంతరం సూర్యను తలవంచి మరీ అభినందించాడు. కోహ్లి నుంచి ఊహించని ఈ చర్యకు ఆశ్చర్యపోయిన సూర్యకుమార్ ఏం మాట్లాడాలో తెలియక.. ఏంటి బ్రో ఇది.. మనం మనం ఒకటి.. పదా ఇద్దరం కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్దాం అని కోహ్లిని హత్తుకుని అటుగా తీసుకెళ్లాడు.
Should we bow?
— Star Sports (@StarSportsIndia) August 31, 2022
Y̶e̶s̶,̶ ̶h̶e̶'̶s̶ ̶a̶ ̶k̶i̶n̶g̶ Yes, the King himself does!
DP World #AsiaCup2022 #BelieveInBlue #SuryakumarYadav #INDvHK #INDvHKG #ViratKohli #KingKohli pic.twitter.com/IDmxM0Z8Fu
దీనికి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. కోహ్లి లాంటి అనుభవజ్ఞుడి నుంచి ఊహించిన ఈ చర్యకు చర్యకు ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాలేదని, కింగ్ కోహ్లి చేసిన ఈ పని నన్ను క్లీన్ బౌల్డ్ చేసిందని అన్నాడు. కాగా, కోహ్లి-సూర్యకుమార్‌ల మధ్య ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నపాటి గొడవ జరిగిన విషయాన్ని క్రికెట్ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సిక్సర్ల సునామీ సృష్టించి, 22 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం బాదగా.. కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ ఆడి కెరీర్‌లో 31వ అర్ధసెంచరీ సాధించాడు. సూర్య.. 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా నిలువగా.. కోహ్లి 44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 59 చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సూర్య వరుసగా 6, 6, 6, 0, 6, 2 బాది 26 పరుగులు పిండుకోవడం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఫలితంగా భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఛేదనలో హాంగ్‌కాంగ్ 152 పరుగులకే పరిమతం కావడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది.
చదవండి: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. తొలి భారత ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment