
PC: BCCI/IPL
ఐపీఎల్-2025 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59), ఫిల్ సాల్ట్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే ఈ మ్యాచ్‌తో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ తరపున రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఆర్సీబీ తుది జట్టులో భువీ చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
దీంతో భువీని ఎందుకు అవకాశమివ్వలేదన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్ ఆడకపోవడంపై ఆర్సీబీ మెనెజ్‌మెంట్ అప్‌డేట్ ఇచ్చింది. భువనేశ్వర్ ప్రస్తుతం స్వల్ప గాయంతో బాధపడుతున్నట్లు ఆర్సీబీ తెలిపింది.
అతి త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడని ఆర్సీబీ పేర్కొంది. భువీ స్ధానంలో యువ పేసర్ రసిఖ్ దార్ సలీమ్ తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్-2025 వేలంలో రూ. 10.75 భారీ ధరకు భువనేశ్వర్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment