
PC: IPL.com
ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్‌కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐదు వికెట్ల హాల్‌తో పాటు 25 ప్లస్ పరుగులు చేసిన రెండో బౌలర్‌గా భువనేశ్వర్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో పాటు 27 పరుగులు చేసిన భువీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇకఈ ఘనత సాధించిన జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. గతంలో డెక్కన్ ఛార్జర్స్‌పై జడేజా 48 పరుగులతో పాటు ఐదు వికెట్లు సాధించాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్.. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఓ రనౌట్‌లో కూడా భాగమయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ చేతిలో 34 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమిపాలైంది. దీంతో ప్లేఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ అధికారికంగా నిష్క్రమించింది.
చదవండి: నువ్వేం తింటావు? గుజరాత్‌లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: షమీ వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment