
భువనేశ్వర్ కుమార్
ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం అద్బుతంగా రాణిస్తోందని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పఠాన్ ఐపీఎల్‌లో రాణిస్తున్న యువ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సీజన్‌లో అత్యంత శక్తివంతమైన బౌలింగ్ అటాకింగ్ సన్‌రైజర్స్‌దేనని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.
‘భువనేశ్వర్ వంటి దిగ్గజ బౌలర్ జట్టులో లేకున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. భారత జట్టుకు బుమ్రా ఎంత కీలక బౌలరో సన్‌రైజర్స్‌కు భువీ అంత కీలకం. అతను లేకున్నా గత మూడు మ్యాచ్‌లను సన్‌రైజర్స్ తక్కువ స్కోర్‌లను కాపాడుకుంటూ గెలిచింది. ఇది అషామాషీ వ్యవహారం కాదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేకున్నా.. యువ ఆటగాళ్లు సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మలతో కూడిన పేస్ విభాగం చెలరేగుతోంది. ఇక అంతర్జాతీయ క్రికెటర్లు రషీద్, షకీబ్ అల్ హసన్‌లు ఆకట్టుకుంటున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కుర్రాళ్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సరైన ప్రదేశాల్లో బంతులు వేస్తున్నారు. దీంతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం ఈ ఐపీఎల్ అత్యంత శక్తివంతమైన అటాక్ అని నేను భావిస్తున్నా.’’ అని భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడైన పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఇక వెన్ను నొప్పితో భువనేశ్వర్ గత మూడు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ మూడింటిలో సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌లనే కాపాడుకొని విజయాలందుకుంది. ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు యూసఫ్ పఠాన్ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ యువస్పిన్నర్ మయాంక్ మార్కెండేను సైతం పఠాన్ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment