టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా చహల్ నిలిచాడు. లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఒక్క వికెట్ పడగొట్టిన చహల్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. చహల్ 75 మ్యాచ్‌ల్లో 91 వికెట్లు సాధించాడు.
కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(90) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ రికార్డును చహల్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్‌ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్‌ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: బుమ్రా 'ఓ బేబీ బౌలర్'.. దారుణంగా అవమానించిన పాక్ మాజీ ఆటగాడు
Comments
Please login to add a commentAdd a comment