Photo Courtesy: SRH Twitter
SRH Practice Match: ఐపీఎల్-2021 తొలి దశలో రాణించని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో అంచెలో ఎలాగైనా రాణించాలని భావిస్తోంది. గత తప్పిదాలు పునరావృతం చేయకుండా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఆటగాళ్లు పూర్తిగా ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే బుధవారం నాటి మ్యాచ్ కోసం రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్ తమ ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
వివరాల ప్రకారం.. కెప్టెన్ విలియమ్సన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భువీ టీం.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కేన్ మామ సేన.. 4 వికెట్లు కోల్పోయి కేవలం 151 పరుగులే చేసి ఓటమి పాలైంది. దీంతో కేన్ విలియమ్సన్ అర్ధ సెంచరీ(41 బంతుల్లో 61 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వృథా అయింది.
ఈ క్రమంలో కేన్ మాట్లాడుతూ.. తమ కుర్రాళ్లు బాగా కష్టపడుతున్నారని, కావాల్సినంత ప్రాక్టీసు దొరికిందని చెప్పుకొచ్చాడు. ఇక స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.. ‘‘తొలి దశలో మేం మెరుగ్గా రాణించలేకపోయాం. అయితే, ఇప్పుడు మాత్రం కచ్చితంగా మంచి ప్రదర్శన కనబరిచి ముందుకు సాగుతాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు.
చదవండి: Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ!
#TeamBhuvi vs #TeamKane in our last practice match before our #IPL2021 begins!
— SunRisers Hyderabad (@SunRisers) September 21, 2021
Watch the video to see how things went down! #OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/NFfIEDcZ2Z
Practice is a means of inviting the perfection desired, and the Swing King is a testament to it! ✌️#OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/tMQoMYafOS
— SunRisers Hyderabad (@SunRisers) September 21, 2021
Comments
Please login to add a commentAdd a comment