ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ తన తండ్రి సచిన్ టెండూల్కర్‌కు 14 ఏళ్ల కిందట జరిగిన ఓ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అది కూడా ఎక్కడైతే తన తండ్రికి ఆ అవమానం జరిగిందో అదై మైదానంలో. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో అదిరిపోయే విక్టరీ సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి, రెండు వరుస పరాజయాల తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెమారూన్ గ్రీన్ (64 నాటౌట్), తిలక్ వర్మ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 178 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
చదవండి: సచిన్ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్ అర్జున్! వీడియో వైరల్
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (48), హెన్రిచ్ క్లాసెన్ (36) ఓ మోస్తరుగా రాణించగా.. ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అందరి మన్ననలు అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. సన్‌రైజర్స్ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా, అర్జున్.. భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకుని కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైని గెలిపించాడు.
ఐపీఎల్‌లో అర్జున్‌కు ఇది తొలి వికెట్. అర్జున్.. భువీని ఔట్ చేయడం ద్వారా 14 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో తండ్రి సచిన్‌కు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. నాడు భువీ.. సచిన్‌ను ఓ రంజీ మ్యాచ్‌లో ఇదే వేదికపై డకౌట్ చేశాడు. రంజీల్లో సచిన్‌ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే. తాజాగా భువీని అదే మైదానంలో ఔట్ చేయడం ద్వారా అర్జున్, తన తండ్రికి ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
చదవండి: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో!
Comments
Please login to add a commentAdd a comment