
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోను భువనేశ్వర్ కుమార్ (4-0-12-2) కట్టడి చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది.
ఆఖర్లో ఆయుశ్ బదోని (55 నాటౌట్), పూరన్ (48 నాటౌట్) చెలరేగి ఆడటంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
బదోని, పూరన్ ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఏకంగా 34 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో 19, నటరాజన్ వేసిన 19 ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో బర్త్ డే బాయ్ కమిన్స్‌ను బదోని, పూరన్ ఆడుకున్నారు. కమిన్స్ 4 ఓవర్లలో వికెట్ తీసి ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. నటరాజన్ సైతం ధారాళంగా పరుగులిచ్చాడు. నటరాజన్ 4 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. అరంగేట్రం బౌలర్ (శ్రీలంక) విజయ్‌కాంత్ వియాస్‌కాంత్ (4-0-27-0) అకట్టుకున్నాడు.