
సాక్షి, మీరట్ : భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ ఇంటి వాడయ్యాడు. నేడు (గురువారం) మీరట్‌లో తన ప్రేయసి నుపుర్ నాగర్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు భువనేశ్వర్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో భువీ, నుపుర్ నాగర్‌ల వివాహం ఘనంగా నిర్వహించారు. వివాహం నేపథ్యంలో ప్రధాన పేసర్ భువీకి లంకతో జరగనున్న రెండో, చివరి టెస్టులకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోరుకున్న యువతితోనే కుమారుడు భువీ వివాహం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రికెటర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్.
టీమిండియా సభ్యులు, బీసీసీఐ అధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యేలా నవంబర్ 26, 30 తేదీల్లో బులంద్‌షా, ఢిల్లీలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరో విశేషం ఏంటంటే.. ఈరోజు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేను జహీర్ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలను జహీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజనా శర్మ షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment