
సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టులో ప్రధాన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 23న మీరట్‌లో తన ప్రేయసి నుపుర్ నాగర్‌తో భువనేశ్వర్ వివాహం జరుగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగనున్నట్లు క్రికెటర్ భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ చెప్పారు. టీమిండియా సభ్యులు, బీసీసీఐ అధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యేలా నవంబర్ 26, 30 తేదీల్లో బులంద్‌షా, ఢిల్లీలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.