ఆ రెండు హైదరాబాద్‌వే..
హైదరాబాద్: ఐపీఎల్-10లో డిఫెండింగ్ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాలకు అనుగుణంగా రాణిస్తోంది. సమిష్టిగా ఆడుతున్న మెరుగైన స్థితిలో నిలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా, ముంబై 8 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ టీమ్ మూడింట్లో గెలిచి రెండిట్లో ఓడింది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచి తర్వాత రెండు మ్యాచులు ఓడింది. ఆదివారం జరిగిన హోంగ్రౌండ్ లో జరిగిన తన ఐదో మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టింది. సన్ రైజర్స్ విజయంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్, పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించారు. బ్యాట్స్ మన్, బౌలర్ విభాగాల్లో వీరిద్దరూ ముందుండడం విశేషం.
ఐదు మ్యాచుల్లో 235 పరుగులు చేసిన వార్నర్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా, 15 వికెట్లు పడగొట్టి భువీ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ జట్టుకే చెందిన రషిద్ ఖాన్ 9 వికెట్లతో బౌలర్ల విభాగంలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫోర్లు బాదడడంలోనూ వార్నర్ ముందున్నాడు. ఐదు మ్యాచుల్లో అతడు 26 ఫోర్లు కొట్టాడు.