
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు నో బాల్స్ కోసం పోటీ పడుతున్నారు. ఎక్కడైనా బౌలర్ వికెట్లు తీస్తే ఆనందిస్తారు.. కానీ ఎస్‌ఆర్‌హెచ్ తాము స్పెషల్‌గా ఉండాలని అనుకుందేమో. భువనేశ్వర్‌తో మొదలుపెడితే.. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ మొదటి ఓవర్‌లోనే నో బాల్స్ వేశారు.
ఇందులో భువనేశ్వర్ నోబాల్‌తో వికెట్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో లైఫ్ పొందిన బట్లర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక మిగతా ఇద్దరు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఎక్కడైనా బౌలర్స్ వికెట్ల కోసం పోటీ పడతారు.. కానీ ఇక్కడ మాత్రం నోబాల్స్ కోసం తపిస్తున్నారు.. ఎంతైనా ఎస్‌ఆర్‌హెచ్ కదా ఆ మాత్రం ఉంటుంది అని కామెంట్ చేశారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ నో బాల్స్ గోల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2022: స్పెషల్ బంతితో మెరిశాడు.. ప్రతీసారి జరగాలని రాసిపెట్టి ఉండదు!
Comments
Please login to add a commentAdd a comment