ప్రతీసారి మనకు కలిసిరాదు అని అంటుంటారు. అదే విషయం ప్రస్తుతం మనం చెప్పుకునే సందర్భానికి సరిగ్గా అతుకుతుంది. విషయంలోకి వెళితే.. కటక్ వేదికగా టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇక సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికి వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది.
అయితే గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన డ్వేన్ ప్రిటోరియస్ ఉన్నంతసేపు హడలెత్తించాడు. 13 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. ఒక రకంగా సౌతాఫ్రికా మ్యాచ్ గెలవడంలో ప్రిటోరియస్‌ది కూడా కీలకపాత్రే. ఒక రకంగా బవుమా సక్సెస్ సాధించాడనే చెప్పాలి. ఆ తర్వాత డుసెన్, మిల్లర్‌లు పనిని పూర్తి చేశారు.
అయితే రెండో టి20లో మాత్రం ప్రిటోరియస్‌కు కలిసిరాలేదు. 4 పరుగులు మాత్రమే చేసిన ప్రిటోరియస్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ఆవేశ్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా ప్రిటోరియస్‌తో ఈ మ్యాచ్‌లోనూ భారీ హిట్టింగ్ చేయించి గెలుపును సుగమం చేసుకోవాలన్నా బవుమా ప్లాన్ ఫలించలేదు. దీంతో అభిమానులు.. ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు.. అంటూ కామెంట్ చేశారు.
చదవండి: IND vs SA 2nd T20: విఫలమైన హార్దిక్ పాండ్యా.. ప్రొటీస్ బౌలర్ చర్య వైరల్
Comments
Please login to add a commentAdd a comment