బాబు మూల్యం చెల్లించక తప్పదు | CM Chandrababu failure in devlopment | Sakshi
Sakshi News home page

బాబు మూల్యం చెల్లించక తప్పదు

Published Sun, Jul 31 2016 8:12 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

CM Chandrababu failure in devlopment

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి
మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి
 
తెనాలి: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప రాజనీతిజ్ఞుడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కొల్లిపరలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 54 ప్రాజెక్టులను ప్రారంభించి వాటిలో ఎక్కువభాగం పూర్తిచేసిన ఘనత ఆయనదేనని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల నిపుణుడు విద్యాసాగరరావు ఇటీవల పత్రికాముఖంగా ప్రస్తుతించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ జలప్రదాత విగ్రహాన్ని అన్ని అనుమతులతో ఆనాడు విజయవాడ పోలీస్‌ కంట్రోలు రూము దగ్గర్లో ప్రతిష్ఠించారని, నేటి రాష్ట్రప్రభుత్వం ఎలాంటి ట్రాఫిక్‌ అడ్డంకులు లేకున్నా ఆ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించటం అమానుషమని ఆయన అన్నారు. అడ్డుగా ఉన్నాయనే కుంటిసాకుతో పవిత్ర దేవాలయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూలగొట్టిస్తున్నారని అన్నారు. ఈచర్యలకు చంద్రబాబు తగినమూల్యం చెల్లించక తప్పదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement