
పూజా హెగ్డే
‘‘ఏ ప్రయాణంలో అయినా గెలుపోటములు సహజం. ఈ రెంటినీ సమానంగా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం. కానీ ఈ రెండు విషయాల్ని అందరూ ఒకేలా తీసుకోవాలనే రూలు లేదు. నా విషయానికి వస్తే.. ఏదైనా ఫెయిల్యూర్ వస్తే పదిహేను నిమిషాలు ఏడ్చేస్తాను’’ అంటున్నారు పూజా హెగ్డే. ఫెయిల్యూర్‌ని తీసుకోవడం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘మనం కష్టపడి చేసిన పనికి అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు.
ఓడినంత మాత్రాన ప్రయాణం ఆగినట్టు కాదు.గెలిచినంత మాత్రాన ప్రయాణం పూర్తయినట్టూ కాదు. అయితే ఓడిపోయినప్పుడు కచ్చితంగా బాధపడతాం. నేనైతే ఒక పదిహేను నిమిషాలు మనస్ఫూర్తిగా ఏడ్చేస్తాను. బాధ మొత్తం పోతుంది. ఈ విషయం ‘ఓప్రా’ (ఫేమస్ అమెరికన్ ఫిలాంత్రఫిస్ట్) నుంచి నేర్చుకున్నాను. అలా అప్పటికప్పుడు మనం ఏదో ఒక విధంగా బాధను పోగొట్టుకోవాలి. మళ్లీ పాజిటివ్ మైండ్‌తో నెక్ట్స్ చాలెంజ్‌కు రెడీ అయిపోవాలి’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment