Power Grid Plant
-
అప్పుడేమో ఘనం! ఇప్పుడేమో ఇలా..
ధరణి.. బిహార్ రాష్ట్రంలో ఓ కుగ్రామం. అయితేనేం అరుదైన ఘనత ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సోలార్ మినీ గ్రిడ్స్‌లో బిహార్‌లోనే తొలి సోలార్ గ్రామం ఘనతను ధరణి సాధించింది. కానీ, ఆ ముచ్చట కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. 2014 ఆగష్టులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ జెహానాబాద్ జిల్లా ధరణి గ్రామం ఈ సోలార్ ప్రాజెక్టును లాంఛ్ చేశారు. ముప్ఫై ఏళ్లపాటు అంధకారంలో ఉన్న గ్రామంలో సోలార్ వెలుగులు సొగసులబ్బాయి. కానీ, కేవలం మూడేళ్లపాటే సోలార్ విలేజ్‌గా కొనసాగింది. ఆ తర్వాత మెయింటెన్స్ లేకపోవడంతో సోలార్ గ్రిడ్ పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆ సెటప్ అంతా మూలన పడిపోయింది. ఇప్పుడా ప్రాజెక్టు పశువుల పాకగా మారింది. భారంగా.. ►ఈ నేపథ్యంలో సంప్రదాయ థర్మల్ పవర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు ఆ గ్రామస్తులు. ►ఆ ఒక్క గ్రామమే కాదు.. దేశంలో ప్రభుత్వాలు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల తీరు ఇలాగే ఉంది. ►సోలార్ పవర్‌ను చాలా చోట్ల నకిలీ కరెంట్‌గా భావించడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు సోలార్ కరెంట్‌పై సరైన అవగాహన కల్పించడంలో విఫలం అయ్యింది. ►సోలార్‌తో అధిక టారిఫ్‌లు భారంగా మారుతున్నాయి. దీనికంటే సంప్రదాయ విద్యుత్‌కే టారిఫ్ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ►సబ్సిడీల విషయంలో ప్రభుత్వాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి. ►ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 14 వేలకు పైగా మైక్రో, మినీ గ్రిడ్స్.. 20 లక్షల సోలార్ హోం సిస్టమ్స్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ►ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడం మరో సమస్యగా మారుతోంది. ►చాలావరకు గ్రామపంచాయితీల్లో సోలార్ వెలుగులు కేవలం వీధి దీపాల వరకే పరిమితం అవుతున్నాయి. ► ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్లు సైతం నిర్వహాణ భారంగా మారడం.. పలు కారణాలతో ఈ వ్యవస్థ విఫలం వైపు అడుగులేసింది. చదవండి: రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్టెల్.. కారణం ఇదే -
పవర్ గ్రిడ్‌కు ‘సీఎస్ఆర్’ గోల్డ్ మెడల్
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ల నిర్వహణలో క్రియాశీల పాత్ర పోషించినందుకుగాను పవర్ గ్రిడ్ ఎస్‌ఆర్‌టీఎస్–1 బంగారు పతకాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ నరసింహన్ ఈ అవార్డు ప్రదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్‌లను నిర్వహించి 56,000 మంది గ్రామీణ ప్రాంతాల వారికి పవర్‌గ్రిడ్ విశేష సేవలందించింది. ఇందుకు రూ.1.15 కోట్లు వ్యయమయ్యింది. ఒక తెలంగాణలో 12 ప్రాంతాలలో 36,468 గ్రామాలలో క్యాంప్‌లను నిర్వహించగా.. ఇందుకు రూ.59.08 లక్షలను వెచ్చించింది. -
పవర్‌గ్రిడ్ వేరే చోట ఏర్పాటు చేయాలి
డిచ్పల్లి : పవర్‌గ్రిడ్ ప్లాంట్ ఏర్పాటు కోసం మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో సర్వే నిర్వహించారని, జీవనాధారణమైన సాగు భూముల లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యమని రాంపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బాధిత రైతులు తహశీల్ కార్యాలయానికి తరలి వచ్చి ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాంపూర్ శివారులోని సర్వే నెంబర్లు 145, 127, 129 పట్టా భూముల్లో 765 కేవీ పవర్ గ్రిడ్‌ను ఏర్పాటు కోసం భూసేకరణకు సర్వే నిర్వహించారని అన్నారు. ఈ భూముల్లో పలువురు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. జీవనాధారంగా ఉన్న సాగు భూములను ప్రభుత్వం లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుందని రైతులు వాపోయారు. మండలంలోని ఇందల్వాయి శివారులో సర్వే నెంబరు 1107లో సుమారు 280 ఎకరాలు, సర్వే నెంబర్లు 334, 178ఎ, 599, 595, 246, 200ఎ, 173, 174, 175 లలో సుమారు 12 వందల ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని తహశీల్దార్ రవీందర్‌కు వివరించారు. ఈ సర్వేనెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే జరిపించి అనువైన స్థలంలో పవర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. తమ సాగు భూములను తీసుకోవద్దని తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులు అంగీకారం లేకుండా భూములను తీసుకునే అధికారం తమకు లేదని, ఈ విషయంలో నిశ్చింతగా ఉండాలని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయబోమని రైతులకు తహశీల్దార్ హామీ ఇచ్చారు. ధర్నాలో ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి సాయాగౌడ్, మురళి, రైతులు గణేశ్, నవీన్, మల్లయ్య, శంకర్, ఎంకనోల్ల చిన్నవ్వ, రాజవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.