సాక్షి, న్యూఢిల్లీ : 21వ శతాబ్ధంలో ఇంధన అవసరాలు తీర్చడంలో సౌర విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సౌర విద్యుత్ నాణ్యతతో పాటు భద్రతతో కూడినదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని రెవాలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధానమంత్రి మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఏటా 15 లక్షల టన్నుల విలువైన కార్బన్ డయాక్సైడ్‌తో సమానమైన వాయువుల విడుదలను ఈ ప్లాంట్ తగ్గిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.
రెవాలో సౌర విద్యుత్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంత పరిశ్రమలకు విద్యుత్ సరఫరాతో పాటు ఢిల్లీ మెట్రో రైల్‌కు కూడా ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. షాజపూర్, నీముచ్, చత్తార్‌పూర్‌లో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ దశాబ్ధంలోనే రెవాలో సోలార్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంతం శభారీ ఇంధన హబ్‌గా ఎదుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment