న్యూఢిల్లీ: స్థల సమీకరణ సమస్యల కారణంగా దేశీయంగా సౌర విద్యుత్ ఇన్‌స్టలేషన్లు 2023లో 7.5 గిగావాట్ల సామర్ధ్యానికి పరిమితమయ్యాయి. 2022లో నమోదైన 13.4 గిగావాట్ల (జీడబ్ల్యూ)తో పోలిస్తే 44 శాతం తగ్గాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ మెర్కామ్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా మొత్తం స్థాపిత సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 72 జీడబ్ల్యూకి చేరింది. ఇందులో యుటిలిటీ స్థాయి ప్రాజెక్టుల వాటా 85.4 శాతంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల వాటా 14.6 శాతంగా ఉంది.
2022లో భారీ స్థాయి సోలార్ ఇన్‌స్టాలేషన్లు 11.7 గిగావాట్ల నుంచి 51 శాతం క్షీణించి 5.8 గిగావాట్లకు పరిమితమయ్యాయి. పలు భారీ ప్రాజెక్టులకు గడువు పొడిగించడం, స్థల సమీకరణ..కనెక్టివిటీ సమస్యలు మొదలైనవి ఇందుకు కారణమని నివేదిక వివరిచింది. కొత్తగా జోడించిన సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యల్లో భారీ ప్రాజెక్టుల వాటా 77.2 శాతంగాను, రూఫ్‌టాప్ సోలార్ వాటా 22.8 శాతంగాను ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి సోలార్ విద్యుత్ సామరŠాధ్యలు అత్యధికంగా రాజస్థాన్‌కి ఉండగా, కర్ణాటక, గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment