సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. దేశవ్యాప్తంగా మరుగన పడిపోయిన ప్రతిభావంతులు, స్ఫూర్తిని అందించే ఘటనలు చోటు చేసుకునప్పుడు ట్విటర్ వేదికగా వాటికి మరింత ప్రచారం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో కల్లోల కశ్మీరానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను మనతో పంచుకున్నారు.
జమ్ము కశ్మీర్‌లోని పల్లి పంచాయితీ దేశంలోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామ పంచాయితీగా మారి రికార్డు సృష్టించింది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సోలార్ పలకలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా గ్రామానికి అవసరమైన విద్యుత్‌ని సమకూర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో గమనించిన ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. పల్లి గ్రామ పంచాయతీ తరహాలో పంచాయతీ తర్వాత పంచాయతీ లక్ష్యంగా పని చేసుకుంటూ పోతే కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
That’s how to battle climate change and become carbon neutral: Step by step, Panchayat by Panchayat…👏🏼👏🏼👏🏼 https://t.co/vjDcMQ0p2U
— anand mahindra (@anandmahindra) April 27, 2022
చదవండి: నేను తర్వాత కొనేది అదే.. ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment