ఎన్పీడీసీఎల్ తీరే వేరయా! | Enpidisiel separate beings! | Sakshi
Sakshi News home page

ఎన్పీడీసీఎల్ తీరే వేరయా!

Published Fri, May 23 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

Enpidisiel separate beings!

  •      పనులు చేయలేదని కాంట్రాక్టర్‌కు నోటీసులు
  •      బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరిక
  •      అయినా.. అతడికే మరో పని అప్పగింత
  •      పద్ధతి మార్చుకోని సదరు కాంట్రాక్టు సంస్థ
  •      మొదలుకాని రూ.4 కోట్ల పనులు
  •      తలపట్టుకుంటున్న ఉన్నతాధికారులు
  •  హన్మకొండ, న్యూస్‌లైన్ : చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు ఉంది... ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారుల తీరు. ఆ కాంట్రాక్టర్ పది లక్షల రూపాయల పని చేయలేడని తెలిసీ.. అతడికే మళ్లీ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఆయన పద్ధతి మార్చుకోకపోవడం... పనులు ముందుకు సాగకపోవడంతో సదరు అధికారులు ఏం చేయూలో తోచక  తలపట్టుకుంటున్నారు. తమ మీదకు వస్తుందనే  కారణంతో సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్లు నోటీసులు జారీ చేసి చేతులుదులుపుకున్నారు.

    ఇది ఎన్పీడీసీఎల్‌లో వివాదంగా మారడమే కాకుండా... ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  అసలే పనులు చేయడు మొర్రో అంటూ కన్‌స్ట్రక్షన్ విభాగం అధికారులు నెత్తీనోరూ బాదుకున్నా... ఆయ న్ను తీసుకొచ్చి అందలమెక్కించడమెందుకు... ఆ తర్వాత తలపట్టకోవడం ఎందుకని విమర్శిస్తున్నారు.
     
    అసలేమిటంటే...
     
    ఎన్పీడీసీఎల్‌లో హైవోల్టేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టం (హెచ్‌వీడీఎస్) పనుల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన యూడబ్ల్యూటీ సంస్థకు రూ. 40 లక్షల పనులు అప్పగించారు. అంతకుముందు ఖమ్మంలో ఈ సంస్థ పలు పనులు చేసింది. చా లా నిర్లక్ష్యంగా... ఆలస్యంగా పను లు చేయడం  తో సదరు కాంట్రాక్టర్‌పై ఉన్నతాధికారులకు అక్కడి అధికారులు ఫిర్యాదు చేశారు. అంతేకా దు... పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ రెండేళ్ల కిందట మొదలుపెట్టిన పనులు ఇంకా ముం దుకు సాగడం లేదు.

    ఈ సం స్థ పరిధిలో చేస్తు న్న పనులన్నీ ఇలాగే ఆలస్యమవుతున్నాయి. అధికారులు నోటీసులివ్వడం.. అవి అందిన వారం రోజులు ఏదో పని చేయడం... బిల్లు తీసుకోవ డం... పనులు ఆపేయడం పరిపాటి గా మారింది. అయినప్పటికీ ఆ సంస్థపై ఎన్పీడీసీఎల్ అధికారులు మళ్లీ మక్కువ చూపించారు. వరంగల్ సర్కిల్ పరిధిలో సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సంబంధించి ధరలు పెంచాలని బె ట్టు చేస్తున్న స్థానిక కాంట్రాక్టర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశం తో యూడబ్ల్యూటీ సంస్థ ప్రతినిధులను పిలిచి మరీ.. అందలమెక్కించారు. ఆ సంస్థతో ఈ ఏడాది ఏ ప్రిల్‌లో టెండర్ వేయించి ఏకంగా రూ. 4 కోట్ల పని అ ప్పగిం చారు. ఒక్క ప్యాకేజీ (4 సబ్‌స్టేషన్లు) పనులను క ట్టబెట్టారు. కానీ... ఇప్పటివరకు ఒక్క పనీ మొదలుకాలేదు.
     
    ఇప్పుడిలా...

    సబ్‌స్టేషన్ల కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత.. అధికారులకు పాత పనులు గుర్తుకొచ్చారుు. రెండేళ్ల క్రితం యూడబ్ల్యూటీ సంస్థ చేపట్టిన  హెచ్‌వీడీఎస్ పనులు పూర్తికాకపోవడంపై నో టీసులు జారీ చేశారు. బ్లాక్‌లిస్టులో ఎందుకు పెట్టరాదని పేర్కొంటూ నెలరోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని 20 రోజుల క్రితం నోటీసులి చ్చారు. గడువు దాటినా... సదరు కాంట్రాక్టర్ ఇప్పటివరకూ సమాధానం ఇవ్వకపోవడం గ మనార్హం. అయినా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement