ఇంజనీరింగ్ పనులను గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
ఇంజనీరింగ్ పనులపై జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పనులను గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో అమలవుతున్న కార్యక్రమాలపై శనివారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటికే మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతను పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందిస్తున్న నిధులను బ్రిడ్జిల నిర్మాణానికి వినియోగించుకోవాలని, పంచాయతీరాజ్ రహదారుల పక్కన మొక్కలు నాటించాలన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలివ్వాలన్నారు.