భద్రాద్రిలో మాజీ ప్రధాని పూజలు | former Prime minister HD Deve gowda at Bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రిలో మాజీ ప్రధాని పూజలు

Published Sun, Aug 28 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

former Prime minister HD Deve gowda at Bhadrachalam



భద్రాచలం:
మాజీ ప్రధానమంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హరదనహళ్లి దొడ్డేగౌడ దేవే గౌడ (హెచ్.డి.దేవేగౌడ) ఆదివారం తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. సతీమణి చెన్నమ్మతో కలిసి ఆదివారం భద్రాద్రి ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజల అనంతరం పురోహితులు, అధికారులు.. మాజీ ప్రధాని దంపతులకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి గౌరవించారు. తర్వాత తీర్థప్రసాదాలు అందజేశారు. దేవేగౌడ దంపతుల వెంట కొందరు జేడీ(ఎస్) నాయకులు కూడా ఉన్నారు. మాజీ ప్రధాని రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టంచేశారు. దేవేగౌడ దంపతుల పాతఫొటోలు కొన్ని మీకోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement