ఢిల్లీ చేరుకున్న జో బైడెన్‌.. తొలిసారి భారత్‌లో పర్యటన | PM Modi Invitation To Dignitaries For G20 Summit Updates - Sakshi
Sakshi News home page

జీ-20 సదస్సు.. భారత్‌ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

Published Fri, Sep 8 2023 10:51 AM | Last Updated on Fri, Sep 8 2023 7:26 PM

Modi Govt Invitation To Dignitaries For G-20 Meeting Updates - Sakshi

updates..

తొలిసారి భారత్‌ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్స కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

►అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌భారత్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బైడెన్‌కు విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ స్వాగతం పలికారు.
తొలిసారి భారత్‌లో జోబైడెన్‌ పర్యటిస్తున్నారు. ఐటిసి మౌర్య  హోటల్లో బస చేయనున్నారు జో బైడెన్.

ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి అమెరికా అధ్యక్షుడు బయలుదేరారు. తన నివాసంలో జో బైడెన్‌కు మోదీ ప్రైవేటు డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ అనంతరం ఇరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. భారతదేశంలో జెట్ ఇంజిన్‌లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం.. ప్రధాని, యూఎస్‌ అధ్యక్షుడు జోబైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న ఎజెండాలో ప్రధాన అంశాలు

►జీ 20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా ఢిల్లీకి చేరుకున్నారు.  రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు.

►రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అధ్యక్షుడు పుతిన్‌కు బదులుగా జీ20 సదస్సుకు లావ్రోవ్‌ హాజరవుతున్నారు.

►ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో ఘట్టర్స్‌కు గన స్వాగతం 

►ఢీల్లీలో అర్జంటీనా ప్రెసిడెంట్‌ అల్బర్ట్‌ ఫెర్రాండెజ్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలకు ఘన స్వాతం పలికారు.

► జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఢిల్లీకి చేరుకున్నారు

►రాత్రి 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఢిల్లీ చేరుకోనున్నారు. 

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఢిల్లీ చేరుకున్నారు. పాలమ్‌ ఎయిర్‌పోర్టులోఆయన భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రేపు ప్రధాని మోదీతో రిషి సునాక్‌ ధ్వైపాక్షిక భేటీ కానున్నారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్‌కు విచ్చేశారు రిషి.

అంతకుముందు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్‌ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని ‘భారతదేశ అల్లుడు’గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్‌ వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి అశ్వనీ చౌబే

► యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్ మరియు ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్ అజలీ అసోమాని G20 సమ్మిట్ కోసం ఢిల్లీకి వచ్చారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు.

► జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారత్‌ చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 

మూడు రోజుల్లో  15  ద్వైపాక్షిక  సమావేశాలలో పాల్గొననున్న  ప్రధాని నరేంద్ర మోదీ. నేడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు..  జెట్ డీల్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది. 

► ప్రధాని మోదీ శుక్రవారం తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. మారిషస్‌ నేతలతోనూ ఆయన భేటీ కానున్నారు.

► ఇక, శనివారం జీ-20 సదస్సు మధ్యలో యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు జపాన్‌, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతోనూ ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు.

► ఆదివారం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో ప్రధాని మోదీ లంచ్‌ మీటింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత కెనడా ప్రధానితో కొంతసేపు ముచ్చటించనున్నారు.

► తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, కొమొరోస్‌, ఈయూ/ఈసీ (యూరోపియన్‌ కమిషన్‌), బ్రెజిల్‌, నైజీరియా దేశాల నేతలతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షికంగా భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

జీ20 సదస్సు కోసం శుక్రవారం ఉదయం అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీ చేరుకున్నారు.

► జీ-20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్న శనివారం విందు కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు హెచ్‌డీ దేవేగౌడ, మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం అందింది. అయితే, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదని ఆయన ఆఫీసు వర్గాలు తెలిపాయి. 

► ఇక, విందు కార్యక్రమానికి తాను హాజరు కావడంలేదని దేవేగౌడ.. ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఆరోగ్య కారణల రీత్యా తాను హాజరు కాలేపోతున్నట్టు వెల్లడించారు. అయితే, జీ20 సమావేశాలు సక్సెస్‌ కావాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. 

► జీ-20 సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

► ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 

సెప్టెంబరు 9-10 తేదీల్లో జరిగే జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో ఇప్పటికే ఢిల్లీలో సందడి మొదలైంది. ఈ సమావేశం కోసం దేశ రాజధాని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. గత ఏడాది కాలంగా జీ-20కి అధ్యక్షత వహిస్తున్న భారత్‌.. ఈ సమావేశంలో ఆ బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement