
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలసి పోటీచేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం 28 సీట్లలో కాంగ్రెస్ 19, జేడీఎస్ 9 చోట్ల పోటీచేయబోతున్నట్లు తెలిసింది. ఎవరెక్కడ బరిలోకి దిగాలో నిర్ణయించే బాధ్యతను రెండు పార్టీల ప్రధాన కార్యదర్శులకు అప్పగించినట్లు సమాచారం.
ఈ మేరకు జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బుధవారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. కనీసం 12 స్థానాలు ఇవ్వాలని గతంలో కోరిన జేడీఎస్ తాజాగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీకి దక్కే సీట్ల కన్నా కూటమి ఎక్కువ స్థానాల్లో గెలుపొందడమే ముఖ్యమని భావిస్తున్నట్లు దేవెగౌడ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment