
సాక్షి, బెంగళూరు : జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ కర్ణాటక అధ్యక్షుడిగా దళిత నేత, సక్‌లేశ్‌పూర్ ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామి నియమితులయ్యారు. అంతేకాకుండా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మధు బంగారప్ప, యువజన విభాగం అధ్యక్షుడిగా నిఖిల్ కుమారస్వామి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవె గౌడ గురువారం అధికారిక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందటమే కాకుండా గతంలో హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment