జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ (ఫైల్‌పోటో)
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ అసెంబ్లీ తప్పదన్న సర్వేల అంచనాలపై మాజీ ప్రధాని, జేడీ(ఎస్) చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ స్పందించారు. తమ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంచనాలపై స్పందిస్తూ ప్రస్తుతం అది ఓ అంశం కాదని, ఆ పరిస్థితే వస్తే పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు కుమ్మరిస్తున్నాయని, తమ పార్టీ వనరుల లేమితో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తానేం చేయలేనని, ఎన్నికల్లో పోరాడేందుకు ఎవరు తనకు నిధులు సమకూరుస్తారని ప్రశ్నించారు. ఎన్నో ఇబ్బందుల మధ్య తాము రెండు జాతీయ పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నామని చెప్పారు. మైసూర్ సహా బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక సహా కర్ణాటక అంతటా తాము మంచి ఫలితాలను సాధించబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని అన్నారు. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఐక్యత ఇంకా ఓ కొలిక్కిరాలేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment