ఏ హోదాలో మోడీని విమర్శిస్తున్నారు? | in what capacity criticized Modi | Sakshi
Sakshi News home page

ఏ హోదాలో మోడీని విమర్శిస్తున్నారు?

Published Mon, Apr 28 2014 2:57 AM | Last Updated on Fri, Mar 29 2019 8:34 PM

ఏ హోదాలో మోడీని విమర్శిస్తున్నారు? - Sakshi

ఏ హోదాలో మోడీని విమర్శిస్తున్నారు?

ప్రియాంకపై వెంకయ్య ధ్వజం

సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో ఏ హోదాతో ప్రియాంక వాద్రా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని విమర్శిస్తున్నారని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నరేంద్రమోడీపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఆయన ఆదివారం విజయవాడలో ఒక హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

 దేశంలో మోడీ గాలి వీస్తోందని.. కాంగ్రెస్‌కు సెలవు చీటీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి సల్మాన్‌ఖుర్షీద్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చౌహాన్‌లు అవసరమైతే తృతీయ ప్రత్యామ్నాయంతో కలుస్తామని చెప్పడాన్నిబట్టే.. వాళ్లు గెలవ లేరని తేలుతోందని వెంకయ్య ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement