M.venkaiah Naidu
-
ఆకాశవాణి రేడియో కేంద్రం.. మీరు వింటున్నారు..
ఆకాశవాణి రేడియో కేంద్రం.. ఆబాలగోపాలాన్ని అలరించిన అత్యంత ప్రియనేస్తం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి. మన సంస్కృతిని సజీవంగా నిలిపిన ఓషధి. జాతీయ సమైక్యతకు సారథి. కళాకారులకు పెన్నిధి. ఒక్కమాటలో చెప్పాలంటే.. యావత్ భారత జనజీవనాన్ని అత్యంత ప్రభావితం చేసింది. మన జాతి సంస్కృతి సంప్రదాయాలను నిలపడంలో, కళలు మొదలు కరెంట్ అఫైర్స్ వరకు ఆకాశవాణి పోషించిన పాత్ర మరపురానిది. వార్తలకు అత్యంత ప్రామాణికత, ప్రాధాన్యం ఉండేది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, వివిధ సమయాల్లో ప్రజలు ఆకాశవాణి వార్తలపైనే ఆధారపడేవారు. అలనాటి తరాన్ని అలరించిన ఆకాశవాణి.. ఇప్పుడు సింహపురి వాణిగా శ్రోతలను అలరిస్తోంది. నెల్లూరు(బారకాసు): ఆకాశవాణి.. విజయవాడ, విశాఖపట్నం కేంద్రమంటూ సమాజంలో జరిగిన ముఖ్యమైన విశేషాలను వార్తల రూపంలో ప్రసారాలతో శ్రోతలను రేడియోలకు కట్టిపడేసింది. పాడి పంటలు, నాటికలు, భక్తి గీతాలు, సినీపాటలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, ఇలా అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసి అలరించేది. సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు శ్రోతలను ఓలలాడించిన రేడియో ఆధునిక టెక్నాలజీ కారణంగా కనుమరుగైంది. టెలివిజన్ రంగం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఈక్రమంలో సాంకేతికతను అందిపుచ్చుకుని ఎఫ్ఎం స్టేషన్లను తీసుకురావడం ద్వారా ఆకాశవాణి ప్రసారాల్లో నాణ్యత, స్పష్టత పెరిగింది. దీంతో శ్రోతలు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతి (భారత ప్రజా సేవా ప్రసార సంస్థ)ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల భాషకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన వివిధ కార్యక్రమాలను ప్రసారాలు చేయడం ప్రారంభించింది. చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు) నెల్లూరులో.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో నెల్లూరుకు ఆకాశవాణి కేంద్రం మంజూరైంది. ఈ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు దీనిని గత నెల 27వ తేదీన ఆయన చేతుల మీదుగానే ప్రారంభించడం విశేషం. కార్పొరేట్ హంగులతో భవనాన్ని నిర్మించి అందులో అత్యాధునిక టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో వంద మీటర్ల ఎత్తులో ప్రసార టవర్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా ఈ కేంద్రం నుంచి 85 కి.మీ. మేర వరకు ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇదే కేంద్రం నుంచి కేవలం 45 కి.మీ. మేర లోపే ప్రసారాలు అందుబాటులో ఉండేవి. నెల్లూరులో స్థానిక భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, స్థానిక పండగల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. సింహపురిలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన రాష్ట్రంలో మొదటగా విజయవాడ తర్వాత విశాఖపట్నం, కడప, తిరుపతి రేడియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతకాలానికి అనంతపురం, కర్నూలు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఇటీవల నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడి కేంద్రం విశేషాలు ►నెల్లూరులో 2019 మేలో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రారంభం ►అదే ఏడాది నవంబర్‌లో ఎఫ్ఎంఎస్ ఆధారిత సేవలు ►2020 ఫిబ్రవరిలో ఉదయం కార్యక్రమాలు ప్రారంభం. ►2020 సంవత్సరం జూలైలో ఆకాశవాణి కేంద్రాన్ని సింహపురి ఎఫ్ఎం కేంద్రంగా మార్చారు. ►2020 ఆగస్టులో సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ►న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచానికి సింహపురి ఎఫ్ఎం సేవలు అందుబాటులోకి.. ►2021 నవంబర్‌లో జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ప్రత్యేక బులెటిన్ ప్రసారం. ►కరోనా కాలంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు. ►నెల్లూరుకు చెందిన వారితో కవి సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు ప్రసారం. ►స్థానిక సాహితీవేత్తల సహకారంతో ప్రకృతి నేర్పిన పాఠాలు, పెన్నా కథల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. ►ప్రసార సామర్థ్యాన్ని పెంచేందుకు టవర్ ఎత్తును వంద మీటర్ల వరకు ఏర్పాటు. ►ఎంత వ్యయంతో.. : రూ.15 కోట్లు ►ప్రసారాలు : ఉదయం 5.48 నుంచి రాత్రి 11.11 గంటల వరకు -
‘జై ఆంధ్రా’ నుంచి.. ‘ఉప రాష్ట్రపతి’ వరకు!
(ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ప్రకటించిన సందర్భంగా సోమవారం ఢిల్లీలోని నివాసంలో ఆయనకు స్వీట్లు తినిపిస్తున్న భార్య ఉష, కుటుంబ సభ్యులు) నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. నమ్మిన భావజాలంపై మొక్కవోని అంకిత భావం.. తెలుగు, ఇంగ్లిష్, హిందీలో ప్రాసలతో మాట్లాడుతూ ప్రత్యర్థులను హడలెత్తించే గుక్కతిప్పుకోని చమత్కార వాగ్ధాటి.. వెరసి ముప్పవరపు వెంకయ్య నాయుడు! ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన 68 ఏళ్ల వెంకయ్య గెలుపోటముల మధ్య తడబడకుండా నిలకడతో, దృఢచిత్తంతో రాజకీయాల్లో రాణించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం వరకు సాగిన ఆయన ప్రస్థానమిదీ.. వెంకయ్య విద్యార్థి దశలో ఆరెస్సెస్‌లో కొన్నాళ్లు పనిచేశాక ఏబీవీపీలో ప్రవేశించారు.1972–73 జై ఆంధ్ర ఉద్యమంలో ఆయన వాగ్ధాటి అందరినీ ఆకట్టు కుంది. ఎమర్జెన్సీ సమయంలో కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడిపిన ఆయన తర్వాత అరెస్టయి విశాఖ జైల్లో ఉన్నారు. లా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్పూర్తితో ఆవిర్భవించిన ఛాత్ర సంఘర్ష సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా ఎన్నిక య్యారు. తర్వాత జనతా పార్టీ యువజన విభాగం యువజనత రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 1978లో అసెంబ్లీకి.. ఎమర్జెన్సీ నిర్బంధం నుంచి విడుదలయ్యాక వెంకయ్య తొలిసారి 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను పులి వెంకటరెడ్డి(కాంగ్రెస్) 80 వేల ఓట్ల తేడాతో ఓడించారు. తర్వాత వెంకయ్య 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం ఉదయగిరి నుంచి జనతా టికెట్‌పై గెలిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 20వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పక్క నియోజకవర్గం ఆత్మకూరులో పోటీచేసి ఓడారు. తర్వాత లోక్‌సభకు రెండుసార్లు పోటీ చేసి రెండుసార్లూ ఓడిపోయారు. 1989లో బాపట్ల నుంచి ఓటమిపాలయ్యారు. తర్వాత ఆరేళ్లవరకూ ఎన్నికల జోలికిపోని వెంకయ్య 1996 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీచేశారు. ఎంఐఎం సిటింగ్ ఎంపీ సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ చేతిలో 70 వేలకుపైగా ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీచేయలేదు. కర్ణాటక నుంచి పెద్దల సభకు.. కర్ణాటకలో తమ బలం పెరగడంతో బీజేపీ వెంకయ్యను అక్కడి నుంచి రాజ్యసభకు పంపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి పదవులు సమర్థంగా నిర్వహించడంతోపాటు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు వెంకయ్యకు కలసి వచ్చాయి. వరుసగా 1998, 2004, 2010లో కర్ణాటక నుంచే మూడుసార్లు ఆయన ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999–2002 మధ్య వాజ్‌పేయి కేబినెట్లో మంత్రిగా, 2002–2004 మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, తర్వాత ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. 2014లో మోదీ తొలి కేబినెట్లో చేరిన వెంకయ్య రాజ్యసభ మూడో పదవీకాలం కిందటేడాది ముగిసింది. అయితే ఆయనను నాలుగోసారి తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి కర్ణాటక బీజేపీ నేతల్లో కొందరు ససేమిరా అన్నారు. దీంతో 18 ఏళ్ల తర్వాత ఆయనకు కన్నడ ప్రాంతలో చుక్కెదురైంది. అయినప్పటికీ ఆయన పనితీరుపై మోదీకి ఉన్న నమ్మకం, అధిష్టానం వద్ద పలుకుబడి కారణంగా 2016 రాజ్యసభ ఎన్నికల్లో రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగలిగారు. అయితే సొంత రాష్ట్రం నుంచి పార్లమెంటులో ప్రవేశించలేకపోవడం వెంకయ్య విజయాలపై క్రీనీడలాంటిదే. వెంకయ్య, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీల పథకం, రియల్ ఎస్టేట్ చట్టం వంటి కీలక పథకాలు, చట్టాలు సాకారం అయ్యాయి. ‘ఉషాపతి’గానే ఉంటాను.. మూడు భాషల్లో అనర్గళ వా గ్ధాటి, వాజ్‌పేయి కేబినెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేయ డం జాతీయ రాజకీయాల్లో వెంకయ్య నిలదొ క్కుకోవడానికి ఉపకరించింది బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ వర్గీయుడిగా ముద్ర ఉన్నా, 2013 నాటి బీజేపీ అంత ర్గతపోరులో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించి మోదీకి మద్దతివ్వడం వెంకయ్యకు కలిసొచ్చింది. ప్రభుత్వంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరొందిన ఆయనకు 2014 మళ్లీ కేంద్ర కేబినెట్లో కీలక శాఖలు దక్కాయి. ఒక దశలో రాష్ట్రపతి పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉందనే వార్తలూ వినిపించాయి. దీనిపై ఆయన చమత్కారంగా స్పందిస్తూ.. తనకు ‘ఉషాపతి’గానే ఉండటం ఇష్టమమని భార్య పేరును ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి పదవి గురించి ప్రస్తావించగా, ‘ప్రజల మధ్య ఉండడమే నాకిష్టం. అలం కార ప్రాయమైన ఉపరాష్ట్రపతి పదవిపై ఆశ లేదు’ అని అన్నారు. వెంకయ్య జీవిత విశేషాలు.. ⇒పేరు: ముప్పవరపు వెంకయ్య నాయుడు ⇒పుట్టిన తేదీ: 01.07.1949 ⇒పుట్టిన ఊరు: చవటపాలెం, ఉదయగిరి తాలూకా, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ⇒తల్లి: రమణమ్మ ⇒తండ్రి: రంగయ్య నాయుడు ⇒భార్య: ముప్పవరపు ఉష ⇒వివాహం: 1971 ఏప్రిల్ 14 ⇒విద్యార్హతలు: బి.ఎ., బి.ఎల్. ⇒పిల్లలు: కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్ ⇒వృత్తి: రాజకీయ నేత, సామాజిక కార్యకర్త, రైతు చేపట్టిన పదవులు ⇒1971:నెల్లూరు వి.ఆర్.కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ⇒1973–74: ఏయూ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు ⇒1974: లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్ విద్యార్థి సంఘర్‡్ష సమితి కన్వీనర్, ఏపీ ⇒1977–80: జనతా పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు, ఏపీ ⇒1978–83, 1983–85: ఎమ్మెల్యే, ఏపీ ⇒1980–83: ఆల్ ఇండియా బీజేపీ యువజన విభాగ ఉపాధ్యక్షుడు ⇒1980–85: బీజేపీ లెజిస్లేచర్ పార్టీ, ఏపీ ⇒1985–88: ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ⇒1988–93: ఏపీ బీజేపీ అధ్యక్షుడు ⇒1993–2000: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ⇒1996–2000: బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శి, బీజేపీ అధికార ప్రతినిధి ⇒1998 ఏప్రిల్: రాజ్యసభకు ఎన్నిక(కర్ణాటక నుంచి) ⇒2000 సెప్టెంబర్–2002 జూన్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ⇒2002 జూలై–2004 అక్టోబర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ⇒2004 జూన్: రాజ్యసభకు రెండోసారి ఎన్నిక(కర్ణాటక నుంచి) ⇒2006–08: పిటిషన్ల కమిటీ చైర్మన్(రాజ్యసభ) ⇒2006 నుంచి ఇప్పటివరకు: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు ⇒2010 జూన్: మూడోసారి రాజ్యసభకు ఎన్నిక(కర్ణాటక నుంచి) ⇒2014 మే 26– 2016 జులై 6: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ⇒2016 మే: నాలుగో సారి రాజ్యసభకు ఎన్నిక(రాజస్తాన్ నుంచి) ⇒2016 జూలై 6 నుంచి ఇప్పటి వరకు: పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖల మంత్రి ⇒జైలు జీవితం: ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయి జైలు జీవితం గడిపారు ⇒సామాజిక సేవ: స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సేవా కార్యక్రమాలు ⇒పర్యటించిన దేశాలు: అమెరికా, యూకే, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, మారిషస్, మాల్దీవులు, దుబాయ్, హాంకాంగ్, థాయ్‌లాండ్, స్పెయిన్, ఈజిప్ట్, జర్మనీ – సాక్షి, న్యూఢిల్లీ - సాక్షి నాలెడ్జ్ సెంటర్, సాక్షి- న్యూఢిల్లీ -
వెంకయ్య, నిర్మలా సీతారామన్‌లను ఎందుకు వద్దనుకున్నారు?
కేంద్రమంత్రులు ఎం వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్లకు బీజేపీ నాయకత్వం తిరిగి రాజ్యసభ టికెట్లు ఖరారు చేసినా, వారిని స్వరాష్ట్రం నుంచి కాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు? రాష్ట్రానికి చెందిన వీరిద్దరినీ కాదని మహారాష్ట్రకు చెందిన మరో కేంద్రమంత్రి సురేష్ ప్రభును లేదా మరొకరినో ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదించడంలోని ఆంతర్యమేంటి. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పొత్తు కొనసాగించే విషయంలో భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో నిర్మలా సీతారామన్ బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మిగిలిన రెండేళ్లకు మాత్రమే ఆమె ఎన్నిక కావడంతో వచ్చే జూన్ నెలాఖరుతో ఆమె పదవీ కాలం పూర్తవుతోంది. దాంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ మిత్రపక్ష అభ్యర్థిగా నిర్మలా సీతారామన్‌ను తిరిగి ఏపీ నుంచే ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకాలం కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆ రాష్ట్రం నుంచి కాకుండా రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. వెంకయ్యను తిరిగి కర్ణాటక నుంచి ఎంపిక చేయరాదని ఇటీవలి కాలంలో ఆ పార్టీకే చెందిన కొందరు వ్యతిరేకించడం, ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రతిస్పందనలు రావడంతో వెంకయ్యనాయుడును రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. వెంకయ్యనాయుడును కర్ణాటక నుంచి మార్చాలంటే ఆయనను ఏపీ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉంది. కానీ బీజేపీ నాయకత్వం ఆ పని చేయలేదు. ఈ విషయంలో స్వయంగా వెంకయ్యనాయుడే వద్దనుకున్నారా లేక పార్టీ జాతీయ నాయకత్వం ఆ ఆలోచన చేసిందా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ వెంకయ్యను కాదనుకుంటే నిర్మలా సీతారామన్ ను తిరిగి ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి వీలుంది. బీజేపీ నాయకత్వం ఆ పని కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరిద్దరిలో ఒకరికి ఇక్కడినుంచి ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరినీ వేర్వేరు రాష్ట్రాల నుంచి అభ్యర్థులుగా ప్రకటించి మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు పేరును పరిశీలించడం బీజేపీ రాజకీయ వ్యూహంతో వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీతో పొత్తు కొనసాగించే వ్యవహారంలో ఇప్పటికే ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం రానున్న రోజుల్లో అప్పటి పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చన్న వ్యూహంతోనే ఏపీకి చెందిన వారిద్దరినీ కాదని వేరే రాష్ట్రానికి చెందిన నేతను ఎంపిక చేసినట్టు ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు అంశాన్ని పునరాలోచన చేయాల్సిన పరిస్థితే వస్తే స్వరాష్ట్రం నుంచి నేతలు ఉంటే ఒత్తిడి వస్తుందన్న ఆలోచనతోనే వారిద్దరిని వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయంలో ఆ ఇద్దరు నేతలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశం కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉండొచ్చని వినిపిస్తోంది. -
ఇక వెంకయ్య వద్దంట
బెంగుళూరు: వచ్చే జూన్ లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుని తిరిగి కర్నాటక నుంచి ఎంపిక చేస్తారని బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే కర్నాటక ప్రజలు మాత్రం మరోసారి తమ రాష్ట్రం నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నారు. ఇక చాలు వెంకయ్య అంటూ ట్విట్టర్ లో ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడుకు వచ్చే జూన్ 30తో పదవీ కాలం పూర్తవుతుంది. ఇప్పటికే మూడు సార్లు (1998, 2004, 2010) రాజ్యసభకు అవకాశం దక్కించుకున్న వెంకయ్య నాయుడుకు నాలుగోసారి అదికూడా తిరిగి కర్నాటక నుంచే ఎంపిక చేస్తారని బీజేపీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారం నేపథ్యంలో నెటిజన్లు ట్విట్టర్ లో స్పందిస్తూ వెంకయ్యను కర్నాటక నుంచి రాజ్యసభకు పంపించవద్దంటూ ట్వీట్లు చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రస్తుతం కర్నాటక రాష్ట్రం నుంచి పదవీ కాలం పూర్తిచేస్తుకుంటున్న వారిలో వెంకయ్యనాయుడితో పాటు అయనూర్ మంజునాథ్ కూడా ఉన్నారు. ఇద్దరు సభ్యుల పదవీ విరమణ పొందుతుండగా కర్నాటక శాసనసభలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరిగణలోకి తీసుకుంటే ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలదు. కర్నాటక శాసనసభలో 225 మంది శాసనసభ్యుల్లో కాంగ్రెస్ (123), బీజేపీ (44), జేడీ (ఎస్) 40, కేజేపీ (2), ఎస్కేపీ (1), స్వతంత్రులు (9), నామినేటెడ్ (1) ఉన్నారు. ప్రస్తుతం కర్నాటక నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వెంకయ్య నాయుడు తోపాటు ఆ పార్టీకే చెందిన మంజునాధ్, కాంగ్రెస్ కు చెందిన ఆస్కార్ ఫెర్నాండెస్, ఇటీవలే దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా (గతంలో జేడీఎస్ మద్దతుతో ఇండిపెండెంట్ గా గెలిచారు) పదవీ విరమణ చేస్తున్నారు. His contribution to Karnataka secondary, primarily why should a non Kannadiga represent us? #VenkayyaSakayya #GoBackVenkaiah — Hariprasad Holla (@hariprasadholla) May 18, 2016 Hema Malini, Ram Jethmalani, Rajeev Chandrashekar, when will this end? We need our people representing us #VenkayyaSakayya #GoBackVenkaiah — Hariprasad Holla (@hariprasadholla) May 18, 2016 Venkaiah Naidu has been nominated to Rajya Sabha from Karnataka for a decade+ now. But he adopts an Andhra village. Shame on @bjpkarnataka — Srivatsa (@srivatsayb) November 25, 2014 I had forgotten that for 18 years, we had a RS member from Karnataka called Venkaiah Naidu. No more swalpa adjust maadi #VenkayyaSakayya — SANJAY HEGDE (@sanjayuvacha) May 18, 2016 Achievements of @MVenkaiahNaidu 1.Adopt a village in Andhra 2.Impose Hindi 3.Speak for Andhra issues 4.No to learn Kannada #VenkayyaSakayya — Suhruta Yajaman (@syajaman) May 18, 2016 -
వెంకయ్యకు ఎక్కడి నుంచి?
వచ్చే జూన్‌లో రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఈసారి ఎక్కడి నుంచి అవకాశం దక్కుతుందన్నది బీజేపీ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే మూడు దఫాలుగా రాజ్యసభకు అవకాశం దక్కిన వెంకయ్య నాయుడుకు ఈసారి మరో అవకాశం కల్పిస్తారా. కల్పిస్తే ఏ రాష్ట్రం నుంచి అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడు పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు విడుదల చేసింది. తాజా షెడ్యూలు మేరకు జూన్ 11 న ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యకు ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం కల్పిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం మిత్రపక్షమైన టీడీపీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పదవీకాలం కూడా జూన్ నెలాఖరుతోనే ముగుస్తోంది. పైగా రాజ్యసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమెకు అవకాశం లభించగా, ఆమె ఆ పదవిలో రెండేళ్లు మాత్రమే ఉన్నారు. ఆ కారణంగా ఏపీ నుంచి మరోసారి అవకాశం కల్పించాలంటే బీజేపీ జాతీయ నాయకత్వం కచ్చితంగా నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. టీడీపీ తన మిత్రపమైన బీజేపీకి ఒక స్థానమే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క స్థానంలో నిర్మలా సీతారామన్‌కే మరోసారి అవకాశం కల్పిస్తారు. ఆమెను ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మార్చి ఇక్కడినుంచి వెంకయ్యనాయుడికి ఇచ్చే అవకాశాలు లేవు. ఇకపోతే, కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడితో పాటు అయనూర్ మంజునాథ్ పదవీకాలం కూడా ముగుస్తోంది. అయితే కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలదు. కర్ణాటక శాసనసభలో 225 మంది శాసనసభ్యుల్లో కాంగ్రెస్ (123), బీజేపీ (44), జేడీ (ఎస్) 40, కేజేపీ (2), ఎస్కేపీ (1), స్వతంత్రులు (9), నామినేటెడ్ (1) ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వెంకయ్య నాయుడుతో పాటు ఆ పార్టీకే చెందిన మంజునాధ్, కాంగ్రెస్‌కు చెందిన ఆస్కార్ ఫెర్నాండెజ్, ఇటీవలే దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా (గతంలో జేడీఎస్ మద్దతుతో ఇండిపెండెంట్ గా గెలిచారు) ఇప్పుడు రిటైరవుతున్నారు. శాసనసభలో ఉన్న బలాబలాల మేరకు బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం మాత్రమే దక్కే అవకాశాలున్నాయి. గతంలో బీజేపీ నుంచి బహిష్కృతుడైన బీఎస్ యడ్యూరప్పను ఇటీవలే మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. అంటే 2018లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యడ్యూరప్పను పార్టీలో చేర్పించుకున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న పరిస్థితుల్లో కర్ణాటక నుంచి ఈసారి రాజ్యసభకు స్థానికుడినే ఎంపిక చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు పట్టుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి గానీ అటు కర్ణాటక నుంచి గానీ వెంకయ్యనాయుడికి అవకాశం ఉండకపోవచ్చని బీజేపీలోని ఒక వర్గం విశ్లేషిస్తోంది. అయితే జాతీయ నాయకత్వంతో ఆయనకు ఉన్న సంబంధాల కారణంగా తిరిగి కర్ణాటక నుంచే రాజ్యసభకు పోటీచేస్తారని అగ్రనాయకులు చెబుతున్నారు. బీజేపీ తరఫున ఇప్పటికే మూడు సార్లు రాజ్యసభకు అవకాశం దక్కిన వెంకయ్యకు మరోసారి అవకాశం కల్పిస్తారా అన్న అంశంపైన కూడా చర్చ సాగుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో మినగా పార్టీ తరఫున మూడుసార్లకు మించి రాజ్యసభకు అవకాశం ఇవ్వరాదన్నది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రితో ఉన్న సంబంధాల రీత్యా వెంకయ్యనాయుడుకు నాలుగోసారి అవకాశం ఇప్పటికే ఖాయమైందని ఆ పార్టీ జాతీయ నాయకుడొకరు చెప్పారు. మరో రాష్ట్రానికి మార్చడం వల్ల కొన్ని ఇబ్బందులొస్తాయని, ఈసారి కూడా కర్ణాటక నుంచే నామినేషన్ వేస్తారని ఆయన పేర్కొన్నారు. నామినేషన్లకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున దేశవ్యాప్తంగా ఖాళీ అయిన స్థానాల్లో ఎక్కడెక్కడ గెలవగలుగుతాం... ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయం కొద్దిరోజుల్లో జాతీయ నాయకత్వం సమావేశమై నిర్ణయిస్తుందని వివరించారు. -
కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతోంది..
హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై నిఘా వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై.. నెహ్రూ హయాంలో నిఘా పెట్టినట్లు ఓ లేఖ బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్య పైవిధంగా స్పందించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ముద్రా బ్యాంక్, ఇన్సూరెన్స్, జన్‌ధన్ యోజన పేద ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఎర్ర చందనం కూలీల ఎన్ కౌంటర్ విషయంలో విచారణ చేయాలనడం సబబే కానీ.. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై మాట్లాడుతున్న ఎంఐఎం నేతలు పోలీసులపై కాల్పులు జరిపినప్పుడు ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సిమీ కార్యకర్తలను చంపితే మానవ హక్కులు గుర్తుకొస్తాయా అని అన్నారు. -
విభజన చట్టంలో ‘హోదా’ అంశమే లేదు
అప్పుడు చేర్చకుండా ఇప్పుడు కాంగ్రెస్ నాటకాలాడుతోంది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నెల్లూరు: రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల గొంతు కోసిందన్నారు. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలపై మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదని పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఐదేళ్లలో రూ.26,819 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి రూ.1,000 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నెల 28న తిరుపతిలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గంగా, కావేరి నదులతోపాటు కృష్ణా, పెన్నా, గోదావరి నదులను అనుసంధానిస్తామన్నారు. కాంగ్రెస్ నుంచి నేదురుమల్లి కుమారుడి బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈమేరకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆదివారం ఆదేశాలు జారీచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాంకుమార్‌రెడ్డిని బహిష్కరిస్తున్నట్లు రఘువీరా పేర్కొన్నారు. -
‘హోదా’ పరిశీలనలో ఉంది
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ విభజన చట్టంలో కొన్ని సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. విభజన చట్టంలో ఎలాంటి సవరణ ప్రతిపాదనపైనైనా రెండు రాష్ట్రాలతోనూ, సంబంధిత ప్రజాప్రతినిధులతో మాట్లాడాకే ముందుకెళతామన్నారు. శాసనమండలిలో సభ్యుల సంఖ్య, ఉద్యోగుల వ్యవహారాలు, కొన్ని ఇతర అంశాలకు సంబంధించి తానిప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఆయా అంశాలపై కనీసం స్థూలంగానైనా ఏకాభిప్రాయం కుదిరితేనే కేంద్రం ఆ దిశలో ముందుకు సాగుతుందని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఏపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్లతో కలసి ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. దీనిలో కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించే ప్రయత్నాలపై అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. ఇది అంత సులభమైందే అయితే వాళ్లే(కాంగ్రెస్ పార్టీ) ఇచ్చేసి ఉంటే సరిపోయేది కదా? అని అన్నారు. హామీలపై డిమాండ్ చేసే హక్కుకాంగ్రెస్కు లేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కేంద్రంలో చేరే ప్రతిపాదనేది లేదు.. కేంద్ర మంత్రివర్గంలోకి టీఆర్ఎస్ చేరే ప్రతిపాదనేదీ ఇప్పటికి లేదని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాంటి చర్చ తనతోగానీ, ప్రధాని మోదీతోగానీ జరగలేదని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో ఏర్పడిన వివాదాన్ని తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులిద్దరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం సంతోషకర పరిణామమన్నారు. ఏ సమస్యనైనా ఇద్దరూ సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. -
మోదీ, బేడీ జోడీతోనే అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ జోడీతోనే ఢిల్లీ సమగ్రాభివృధ్ధి సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీ భవిష్యత్తు కేంద్రంతో ముడిపడి ఉన్నందున ఢిల్లీలో బీజేపీకే పట్టం కట్టాలన్నారు. మంగళవారం సాయంత్రం వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో కిరణ్ బేడీ కలుసుకున్నారు. ఢిల్లీలోని దక్షిణాది రాష్ట్రాల ఓటర్ల మద్దతు లభించేలా చూడాలని కోరారు. ఢిల్లీ అభివృధ్ధి కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ మొదలుకొని ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాల వంటి పనులు చేసింది. ఎన్నో ఏళ్లుగా అపరిషృ్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించింది. దక్షిణాది ఓటర్లు సహా మిగిలిన వారంతా ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృధ్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు. బీజేపీ వద్ద డబ్బులు తీసుకొని తమ పార్టీకి ఓటేయాలంటూ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చేసినవ్యాఖ్యలపై వెంకయ్య ఘాటుగా స్పందించారు. ‘కాంగ్రెస్‌తో కలిసి అధికారం అందుకుని, అది సాధ్యంకాక పలాయనం చిత్తగించిన కేజ్రీవాల్ తీరును విమర్శిస్తూ సొంత పార్టీ నేతలే బయటకు వస్తున్నారు. డబ్బులు తీసుకోవాలంటూ తప్పుగా మాట్లాడితే ఢిల్లీ ప్రజలు సైతం బుద్ధిచెబుతారు’ అని అన్నారు. మెజార్టీ ఇవ్వకుంటే ప్రజలకే ఇబ్బంది: బేడీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకపోతే ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడటం ఖాయమని కిరణ్ బేడీ అన్నారు. బీజేపీకి పట్టం కడితేనే నగర ప్రజల వికాసంతోపాటు, మహిళా భద్రతకు తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. తన అనుమతి లేకుండా తన ఫొటోలను ప్రచారానికి ఆప్ వాడుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే దీనిపై న్యాయపోరాటం చేసేందుకు తన వద్ద తగినంత సమయం లేదని పేర్కొన్నారు. ఈ ఎన్ని కల్లో తమ పార్టీ గెలుపు తథ్యమంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా కొత్త విద్యావిధానం
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతిఇరానీ వెల్లడి 26న ఈ విద్యావిధానాన్ని ప్రకటించనున్న ప్రధాని మోదీ విశాఖ ఐఐఎంకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ ఈ విద్యావిధానాన్ని ప్రకటించబోతున్నారని ఆమె తెలిపారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి మంజూరైన జాతీయ విద్యాసంస్థల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, విశాఖ(ఐఐఎంవీ)కు శనివారం జిల్లాలోని ఆనందపురం మండలం గంభీరంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులతో కలిసి స్మృతిఇరానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రపంచంతో పోటీపడేలా ప్రస్తుత విద్యావిధానంలో సమూలంగా సంస్కరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువులు కొద్దిమందికేనన్న భావనను తొలగించాలన్న ఆలోచనతో ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ వంటి విద్యాసంస్థల్లో తొలిసారిగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో బోధించే పాఠ్యాంశాలను ఆన్లైన్లో పెడుతున్నామని.. ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చునన్నారు. తొలిసారిగా సర్టిఫికెట్ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నామన్నారు. నామినల్ ఫీజులతోనే ఈ కోర్సులు చేయవచ్చునన్నారు. ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులు ఫీజులు చెల్లించనక్కర్లేదన్నారు. గత బడ్జెట్లో ప్రకటించిన జాతీయ విద్యాసంస్థల్లో విశాఖ ఐఐఎంకు తొలిసారిగా శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఐఐఎం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తామన్నారు. విశాఖ ఐఐఎం బాధ్యతను బెంగళూరు ఐఐఎంకు అప్పగిస్తున్నామని, ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఐఐఎంను జాతికి అంకితం చేయబోతున్నట్టు ప్రకటించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి ఏపీకి దక్కాల్సిన ప్రతీ ప్రాజెక్టు.. ప్రతీ పైసా సాధించుకునేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగువారి తెలివితేటలు అమోఘమైనవని, మైక్రోసాఫ్ట్ సంస్థకు మన తెలుగోడే అధినేత కావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఐఐఎంకు చివర వి(విశాఖ) అని చేర్చాలని.. అప్పుడే వైజాగ్‌కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి: సీఎం విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఏపీనే ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లోని విద్యావిధానాన్ని, కోర్సులను మన దేశంలోనూ ప్రవేశపెట్టేందుకు వీలుగా ఏపీ భాగస్వామ్యంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సాగరమాలలో విశాఖ-కాకినాడల మధ్య పోర్టులను కలుపుతూ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. యూఎస్ఏ సహకారంతో విశాఖను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు త్వరలో ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామన్నారు. నిరసనల సెగ.. వెంకయ్యనాయుడు మాట్లాడుతున్న సమయంలో సభాప్రాంగణంలో విజిటర్స్కోసం ఏర్పాటు చేసిన టెంట్(గుడారం)లో కొంతభాగం గాలికి ఎగిరిపోయింది. దీంతో స్వల్ప గందరగోళం నెలకొంది. హుద్‌హుద్ తుపానే ఏమీ చేయలేకపోయింది.. ఈ గాలి మనల్ని ఏం చేస్తుందిలే అని ఆయన అనడంతో పరిస్థితి సద్దుమణిగింది. మరోవైపు ఈ సభకు నిరసనల సెగ తగిలింది. ఆనందపురంలోని సంతోషిమాత ఆలయ ధర్మకర్త బత్తుల జగన్మోహన్ సీఎంను కలుసుకునేందుకు అవకాశమివ్వకపోతే చచ్చిపోతానంటూ హడావుడి చేశారు. పోలీసులు ఆయన్ను తీసుకెళ్లిపోయారు. మరోవైపు పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు మాట్లాడుతూ.. డ్వాక్రా రుణమాఫీకోసం చంద్రబాబు ప్రకటన చేస్తారని నమ్మించి తీసుకొచ్చారని, తీరా ఇక్కడికొస్తే ఏదేదో మాట్లాడుతున్నారని, సీఎంతో మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ కేకలేశారు. సభ అయిపోయాక సీఎంను కలిసి మాట్లాడవచ్చునంటూ పోలీసులు సర్దిచెప్పారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. మరోవైపు ఐఐఎం భూముల బాధితులకు హౌస్అరెస్ట్ తప్పలేదు. భూముల విషయంలో జరిపిన చర్చలు సఫలీకృతమైనప్పటికీ వారికీ పరిస్థితి ఎదురైంది. వారినుంచి శంకుస్థాపన కార్యక్రమానికి ఏ ఇబ్బందీ ఎదురవకుండా చూడాలన్న ఆదేశాలనేపథ్యంలో పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లి దాదాపు 30 మందిని ఇళ్లనుంచి బయటకు రాకుండా శుక్రవారం నుంచే కాపలా కాశారు. శనివారం వారు ఆందోళనకు దిగడంతో సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పి కొందరిని సభాస్థలికి తీసుకొచ్చారు. అయితే సీఎంతో కలవకుండా వారిని తమ నిర్బంధంలోనే ఉంచుకున్నారు. -
'పూర్తి మెజార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్'
చండీగఢ్: హర్యానా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. హర్యానా పురోభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని హామీయిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ కూడా తమ ప్రభుత్వం రావాలని హర్యానా ప్రజలు కోరుకున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టిన హర్యానా ప్రజలకు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరిగిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి కేంద్ర పరిశీలకుడిగా ఆయన హాజరయ్యారు. -
అధికారం మాదే: వెంకయ్య ధీమా
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 15 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీయేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు, అభిప్రాయ సేకరణలు, ప్రధాన మంత్రి సభలకు భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు, వీటన్నింటిని బట్టి పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మార్కెట్ సెంటిమెంట్, పెట్టిబడిదారుల విశ్వాసం భారీగా పెరిగిందని అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గిందని, నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని వెంకయ్య చెప్పారు. అంతర్జాతీయంగాకూడా భారతదేశ ప్రతిష్ట మరింత మెరుగుపడిందని, బ్రిక్స్ బ్యాంక్ తొలి చైర్మన్షిప్ భారత్‌కు దక్కిందని అన్నారు. ఇవన్నీ మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పారు. ఐదు వారాల వ్యవధిలో తాము దేశవ్యాప్తంగా పేదల కోసం ఐదు కోట్ల జన్‌ధన్ పథకం బ్యాంకు ఖాతాలను ప్రారంభించామని తెలిపారు. గత 23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న న్యాయవ్యవస్థ నియామకాల బిల్లును ఆమోదించామని పేర్కొన్నారు. శివసేనతో తమ బంధం తెగిపోవడం పట్ల వెంకయ్య విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో శివసేన నాయకులు బీజేపీకి బదులుగా కాంగ్రెస్, ఎన్సీపీలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయాలని సూచించారు. కాంగ్రెస్-ఎన్సీపీల 15 ఏళ్ల అవినీతి పాలనను రూపుమాపాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి చెప్పారు. నిరుద్యోగం, అవినీతి, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల వంటి సమస్యలతో సతమవుతున్న రాష్ట్రం విప్లవాత్మకమైన మార్పును కోరుతోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, కేంద్ర రాష్ట్రాల మధ్య సామరస్యానికి, మోడీ సర్కారును బలోపేతం చేసేందుకు బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలు పెరిగాయన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలపై స్పందిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మందుల ధరలు పెరగలేదు, తగ్గలేదు అని చెప్పారు. మహారష్ట్రలో వారికి అతి తక్కువ సీట్లు వస్తాయన్న విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. -
మీరేం చేశారు?
షోలాపూర్ ఎన్నికల ప్రచారసభలోకాంగ్రెస్ను నిలదీసిన వెంకయ్యనాయుడు షోలాపూర్, న్యూస్‌లైన్: ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాలు, తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే మహారాష్ట్ర పరిస్థితి దిగజారిందని కేంద్ర పట్టణాభిృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. షోలాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న వెంకయ్య గతపాలకులపై ధ్వజమెత్తారు. షోలాపూర్ నార్త్ సిటీ బీజేపీ అభ్యర్థి విజయ్ దేశ్‌ముఖ్‌కు మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నం గొంగడి బస్తీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ... స్వతంత్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆరు నెలలైన పూర్తిచేసుకోలేనే మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. 60 సంవత్సరాల పాలనలో మేరేం చేశారో చెప్పండంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనిది కేవలం ఆరు నెలల్లో మోడీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పెళ్లయిన కొత్త జంటకు ఎంతో ఉత్సాహం ఉన్నప్పటికీ పిల్లల్ని కనడానికి కూడా కనీసం తొమ్మిది నెలలు ఆగాల్సిందేనని చమత్కరించారు. ఈ మాత్రం కూడా వారికి తెలియదా..? అని నిలదీశారు. టూ-జీ స్కాం, బొగ్గు, భూమి ఇలా అనేక కుంభకోణాల్లో, అవినీతిలో కాంగ్రెస్ కూరుకుపోయిందని, ఇక ఆ పార్టీ నాయకుల మాటలు వినేవారెవరూ లేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిస్తే రాజ్యసభలో కూడా మా మెజార్టీ పెరుగుతుందని, తదనంతరం మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు సాధ్యమవుతుందని నాయుడు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్త్తోందని, వారి ఆటలు సాగనివ్వకుండా చేయాలని పిలుపునిచ్చారు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఏ మత శక్తులు మనల్ని వేరు చేయలేవన్నారు. శివసేనను తాము వీడలేదని, శివసేనే బీజేపీని దూరం చేసుకుందన్నారు. ఈ బహిరంగసభలో మారుతి ప్రకాశ్, ఇందిరా కుడిక్యాల్, మోహిని పత్కి, సురేశ్ పాటిల్, ఎన్.అశోక్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఉద్యమంలా స్వచ్ఛ భారత్: వెంకయ్య
సాక్షి, నెల్లూరు: స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. జాతి నేతల విగ్రహాలను శుభ్రం చేసి, వీధులు ఊడ్చారు. అనంతరం నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ ఒక రోజు కార్యక్రమం కాదని, నిరంతరం జరగాల్సినదని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 2019లో జరుపుకొనే గాంధీ 150వ జయంతి నాటికి స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దడమే తమ ఆశయమన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి రెండు గంటలు, ఏడాదికి వంద గంటలు పరిశుభ్రత కోసం శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆదర్శప్రాయుడు ప్రకాశం పంతులు తిరుపతి: టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శప్రాయుడని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, మోదీలాంటి ధీరోదాత్తులైన నాయకులు దేశానికి అవసరమని తెలిపారు. ప్రకాశం పంతులు జీవితంపై రాష్ట్ర శాసన సభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి రాసిన ‘ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం’ పుస్తకాన్ని ఆదివారం తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులను ఎదిరించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రకాశం వంటి మహనీయుల చరిత్రను విద్యార్థులు చదవాలన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి నీతి, నిజాయితీతో రాజకీయాలు నడిపిన ప్రకాశం పంతులు చిరస్మరణీయుడని కొనియాడారు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ప్రముఖ రచయిత తుర్లపాటి కుటుంబరావు పంతులు వ్యక్తిత్వాన్ని వివరించారు. బారిస్టర్‌గా సంపాదించిన ఆస్తులను ప్రకాశం స్వాతంత్య్రోద్యమ ప్రచారానికి ఖర్చుచేశారని చెప్పారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర మాట్లాడుతూ తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీని ఏర్పాటుచేసి రాయలసీమలో విద్యావ్యాప్తికి ప్రకాశం బాటలు వేశారని తెలిపారు. అనంతరం వెంకయ్యనాయుడిని పలువురు ఘనంగా సన్మానించారు. -
బుల్లెట్ కంటే బ్యాలెట్టే ‘పవర్’
సాక్షి, విజయవాడ : ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని తెలియజెప్పాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌నేత ఎం.వెంకయ్యనాయుడు కోరారు. మంగళవారం విజయవాడ ఎకన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితుడైన డాక్టర్ కంభంపాటి హరిబాబును అధ్యక్షుడుగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైందని, ఆలోటును జాతీయపార్టీ బీజేపీ భర్తీ చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని దీన్ని పార్టీ నేతలు, శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడి ప్రభుత్వం అభివృద్ధి, సుపరిపాలన అనే లక్ష్యాలతో పనిచేస్తోందన్నారు. మున్సిపల్ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. మోడి ప్రభుత్వ హయాంలో వేగం పెరిగిందని, ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగాయని తెలిపారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీల ఏర్పాటు, ప్రధాన నగరాల్లో మెట్రోరైళ్లు విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నరేంద్రమోడి 100 రోజుల పాలన 100 ముందడుగులని కొనియాడారు. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఏమీ చేసిందని ఇప్పుడే పలువురు ప్రశ్నిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే పున:వ్యవస్థీకరణ చట్టంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను చట్టం చేశామని గుర్తు చేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఏపీ నుంచి పరిపాలన సాగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కొత్త రైల్వే జోన్ ప్రతిపాదనకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని హరిబాబు సూచించారు. బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి... లబ్బీపేట : రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. నవంబరు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు చేర్చాలన్నారు. మాజీ గవర్నర్ వి.రామారావు, జాతీయ అధికార ప్రతినిధి నరసింహరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కృష్ణంరాజు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దాసం ఉమామహేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, శ్రీనివాసరాజు, సినీ నటులు భానుచందర్, సురేష్, శివాజీ, శివాజీరాజ్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన డాక్టర్ కొడాలి రామకృష్ణ, తుమ్మల పద్మ తదితరులు పార్టీలో చేరారు. -
బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల...
కొరుక్కుపేట(చెన్నై): చెన్నైలో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ 87వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డులను అందజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డిని, కేఆర్‌ఎస్‌ఎంఏ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) డెరైక్టర్ ఉమా చిగురుపాటిలను బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డులతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఘనంగా సత్కరించారు. తమతమ రంగాల్లో సేవలందిస్తున్న డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, ఉమా చిగురుపాటి యువతకు ఆదర్శనీయులని అన్నారు. వీరితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఎస్.సీతారామయ్య, శైలేష్ ఆర్.మెహతా, డాక్టర్ జేఏఎస్.గిరిలను సత్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 1928 లో ఏర్పడిన ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ 86 ఏళ్లు పూర్తి చేసుకుని 87వ వసంతంలోకి అడుగిడటం సం తోషకరమన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం మెడికల్ హబ్‌గా అవతరించబోతోందని చెప్పారు. ఆంధ్రా కామర్స్ అధ్యక్షురాలు వీఎల్ ఇందిరాదత్తు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. -
ప్రతీ 5 కిలోమీటర్లకు బ్యాంక్ శాఖ: వెంకయ్య
జన ధన పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతీ ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ‘జన ధన యోజన’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతీ ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడమే కాకుండా, రుణ సౌకర్యం కల్పిస్తున్నామని, మొదటి ఆరు నెలలు ఖాతాను సక్రమంగా వినియోగించిన వారికి రూ. 5,000 ఓవర్ డ్రాఫ్ట్‌ను ఇస్తున్నామని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు తెలంగాణలో జన ధన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక బ్యాంకు శాఖతో పాటు, కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బ్యాంకు ఖాతా ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యమన్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సామాన్యునికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర నిర్ణయాన్ని అభినందించారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని రూ. 5,000 నుంచి రూ.10,000కి, బీమా రక్షణను రెండు లక్షలకు పెంచాల్సిందిగా వెంకయ్యకు సూచించారు. ఒక్క రోజులో 5 లక్షల ఖాతాలు తెలంగాణ రాష్ట్రంలో జన ధన యోజనకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఒక్క రోజులోనే ఈ పథకం కింద సుమారు 5 లక్షల ఖాతాలను ప్రారంభించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు. -
మేధోవలసకు నేతల నిర్లక్ష్యమే కారణం
ఐఐసీటీ సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: భారత్‌లో నైపుణ్యానికి కొరత లేకున్నా.. దాన్ని గుర్తించి మెరుగులు దిద్ది జాతి నిర్మాణంలో భాగం చేసే విషయంలో మాత్రం పార్టీలకతీతంగా నేతలు నిర్లక్ష్యం వహించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే యువత విదేశాల బాటపడుతోందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏడు దశాబ్దాల కాలంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వ్యవసాయం, ఫార్మా, ఆరోగ్య రంగాలకు వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. మేధోవలసపై వెంకయ్య మాట్లాడుతూ యువతీ యువకులు విదేశాలకు వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే అక్కడకు వెళ్లి నేర్చుకుని, నాలుగు రాళ్లు సంపాదించుకుని మళ్లీ మాతృదేశానికి తిరిగి రావాలని మాత్రమే తాను ఆశిస్తున్నానన్నారు. తాను డాక్టర్‌ను, యాక్టర్‌ను కాదని, ట్రాక్టర్ నడిపే ఓ రైతు కొడుకును మాత్రమేనని చతురోక్తులు విసిరారు వెంకయ్య. ఐఐసీటీ ఏడు దశాబ్దాలుగా రసాయన శాస్త్ర పరిశోధనల ద్వారా దేశ సేవ చేస్తోం దని ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీ కాంతం తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డీజీ పీఎస్ అహూజా, ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ అహ్మద్ కమాల్, ఆర్‌బీఎన్ ప్రసాద్, కె. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌరశక్తి ప్రాజెక్టులు: జితేంద్ర సింగ్ సౌరశక్తితోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇం దులో భాగంగా లడఖ్ వంటి ప్రాంతాల్లో భారీ సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన గురువారం చెప్పారు. ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాతా వైష్ణోదేవి ఆలయ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తూ ఆ ప్రాంతం సౌరశక్తి ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనను తమతో పంచుకున్నారని, ఆ స్ఫూర్తితోనే ఆ స్టేషన్లోనే ఒక ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. జాతీయ సౌరశక్తి మిషన్‌ను పూర్తి చేయడంతోపాటు మరికొన్ని ఇతర ప్రాజెక్టులూ చేపడతామన్నారు. -
ఎన్డీయేకు పేరొస్తుందనే..!
బీమా బిల్లుకు కాంగ్రెస్ అడ్డు: వెంకయ్య న్యూఢిల్లీ: బీమా బిల్లు ఆమోదం పొందితే మోడీ ప్రభుత్వానికి మంచిపేరొస్తుందనే ఆందోళనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోందని, అందుకే బిల్లు అడ్డుకోవడానికి యత్నిస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నిజానికి యూపీఏ హయాంలోనే బిల్లు రూపొందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో వెంకయ్య మాట్లాడారు. ఉభయసభల చర్చల్లో పాల్గొనాలని, అవసరమైతే ఓటింగ్‌లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండాలని పార్టీ ఎంపీలను కోరారు. యూపీఎస్సీ వివాదాన్ని కాంగ్రెస్, యూపీఏలు సృష్టించాయన్నారు. ఈనెల 9వ తేదీన ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ భేటీ జరగనుందని వెల్లడించారు. కాగా, బీమా బిల్లుపై విపక్షంతో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు బీమా బిల్లుపై తాము ద్వంద్వ వైఖరితో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. -
కలసి పని చేయండి..
చంద్రబాబు, కేసీఆర్‌కు కేంద్ర మంత్రి వెంకయ్య సూచన సీఎంలు కరచాలనం చేసుకోవటం పెద్ద వార్తగా ఎందుకైంది? దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరినీ కోరా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు పరస్పరం కరచాలనం చేసుకోవటం పెద్ద వార్తగా కావటంపై వారిద్దరూ ఆలోచన చేసుకుంటే మంచిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇద్దరు ముఖ్యమంత్రులు కరచాలనం చేసుకోవడం పెద్ద వార్త కాకూడదు. కానీ అయింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై వారే ఆలోచించాలి. విభేదాలుంటే వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్నది నా ఆకాంక్ష. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులకూ సూచించా. పాటిస్తారో లేదో వారి ఇష్టం’ అని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 1956 స్థానికత నిబంధనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చట్టం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్డర్ నుంచి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా, రియల్ ఎస్టేట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా బిల్లు ఉంటుందన్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తోపాటు క్రెడాయ్ లాంటి సంస్థలతోనూ చర్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వచ్చే అవకాశం ఉందన్నారు. -
కేసీఆర్‌తో వెంకయ్య దోస్తీ
తనంతట తానుగా వెళ్లి కలసిన కేంద్ర మంత్రి ఇరు రాష్ట్రాల మధ్య అగాధం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మళ్లీ దోస్తీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. శనివారం ఆయన తనంతట తాను తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. అంతకు ముందు చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పలు అంశాలపై తీవ్రస్థాయిలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అం శాలపై బాబు సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులందరూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుం డగా... వీటికి ప్రతిగా కేసీఆర్ వీలున్నప్పుడల్లా చంద్రబాబుపైన, వెంకయ్యపైన ధ్వజమెత్తుతున్నారు. వెంకయ్య కూడా కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టేవారు. ఇటీవలి కాలంలో కేసీఆర్‌పై వెంకయ్యనాయుడు వైఖ రిలో మార్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయా లు, ఇతర అంశాలపై మాట్లాడనని చెబుతున్నారు. సమస్యలపై రెండు ప్రభుత్వాలూ కలసి కూర్చొని మాట్లాడుకోవాలన్నది తన ఆకాంక్షని అంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోవాలి : వెంకయ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సలహా ఇచ్చినట్టు వెంకయ్యనాయుడు చెప్పారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల సీఎంలను మర్యాదపూర్వకంగా కలసినప్పటికీ, ఈ సమావేశాలు అర్థవంతంగా సాగాయన్నారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన గ్యాప్ తొల గించడానికి తాను కేసీఆర్‌తో భేటీ అయ్యానన్న మీడి యా ప్రతినిధుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించిన వివాదంపై మాట్లాడబోనన్నారు. విభజన చట్టంలో పేర్కొ న్న అంశాల మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాలని, వివాదాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీకి నిధులివ్వాలని కోరిన బాబు వెంకయ్యనాయుడుతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, మంజూరు చేయాల్సిన పనుల విషయంలో సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. విశాఖ, వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టులను సత్వరమే ప్రారంభించి పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరానన్నారు. -
అనధికారిక నివాసంపై 16 మంది మాజీ మంత్రులకు నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాల్లో అనధికారికంగా నివాసముంటున్న 16 మంది కేంద్ర మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. లోక్‌సభలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు వెంకయ్య లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అనధికారికంగా నివాసముంటున్న మాజీ మంత్రులు జూలై 27 వరకు డ్యామేజీ చార్జీల కింద రూ. 20,92,463 చెల్లించాల్సి ఉంటుందన్నారు. టైపు-5 బంగళకు రూ. 53,250 నుంచి టైపు-3 బంగ్లాకు రూ.2,43,678 వరకు చార్జీలు ఉన్నట్టు తెలిపారు. అనధికారికంగా నివాసముంటున్న వారిలో మాజీ మంత్రులు కపిల్ సిబల్, అజిత్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, బేణీ ప్రసాద్‌వర్మ, పల్లంరాజు, బలరాం నాయక్, కిల్లి కృపారాణి, మానిక్రావ్ హోదయ్ గవిత్ ఉన్నారు. జనరల్ పూల్ కోటా కింద నివాసముంటున్న వారిలో ఎ.కె.ఆంటోనీ, ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, వీరప్పమొయిలీ, కె.చిరంజీవి, జేడీ శీలం తదితరులు ఉన్నారు. వీరికి ఖాళీ చేయడానికి 15 రోజుల గడువు ఇచ్చారు. కాగా, తనకు కేటాయించిన భవనాన్ని ఐదు రోజుల క్రితమే ఖాళీ చేశానని మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తెలిపారు. -
విధులకు ఆలస్యంగా వస్తే చర్యలు
నిర్మాణ్ భవన్లో వెంకయ్య ఆకస్మిక తనిఖీ న్యూఢిల్లీ: విధులకు ఆలస్యంగా వచ్చే సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. స్థానిక నిర్మాణ్‌భవన్‌లోని కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో వెంకయ్య సోమవారం ఉదయం గంట పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో చాలా చోట్ల సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. హాజరు రిజిస్టర్లను మంత్రి పరిశీలించగా.. సిబ్బంది సంతకాలు కనిపించలేదు. సిబ్బంది నిర్వాకాన్ని తీవ్రంగా పరిగణించిన వెంకయ్య 80 మందికి సంజాయిషీ నోటీసులు ఇవ్వాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. విధులకు ఆలస్యంగా వచ్చే సిబ్బందికి గైర్హాజరు పెట్టాలని, వేతనాల్లో కోతలు విధించాలని మంత్రి ఆదేశించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని త్వరగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ్‌భవన్‌లో పారిశుద్ధ్యంపై వెంకయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలో తనిఖీలతో పోలిస్తే ఇప్పుడు పారిశుద్ధ్యం మెరుగు పడిందన్నారు. -
'రాజధాని విషయంలో మా జోక్యముండదు'
-
'తెలంగాణ అంబాసిడర్ సానియాపై స్పందించను'
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఆయన మంత్రి వర్గం ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో వెంకయ్య మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి కూర్చుంటే చాలా వివాదాలు పరిష్కారమవుతాయని తెలిపారు. రుణమాఫీలో కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తాయని చెప్పారు. బ్రిక్స్ సమావేశాలు, యూపీఎస్పీ నిబంధనలు, రైలు ఛార్జీలు వంటి పలు అంశాలల్లో కేంద్రాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం సెల్ప్ గోల్ చేసుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్, ఇతర పక్షాలు తమ ఓటమిని జీర్ణించుకోలేకే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన క్రీడాకారిణి సానియా మీర్జా అంశంపై స్పందించేందుకు వెంకయ్య నిరాకరించారు. విభజన ద్వారా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే సదరు ఉద్యోగులు కమిటీకి విన్నవించుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు. -
2020 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తిరుపతి : దేశంలోని సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ 2020 నాటికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ది కేంద్రం లక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూ.15 కోట్ల తో నిర్మించిన హాలిడే హోంను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ దేశంలో పేదలందరికీ అన్ని మౌలిక సదుపాయాలతో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందన్నారు. ప్రస్తుతం 31 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని, 2020 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన 23 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. -
గత ప్రభుత్వమే ఆర్డినెన్స్ తెచ్చింది: వెంకయ్య
చర్చ జరిగి ఉంటే అన్ని విషయాలు ప్రజలకు తెలిసేవి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే తెచ్చిందని, ఇందులో వివాదం లేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అనవసరంగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఆర్డినెన్స్ లోక్‌సభ ఆమోదం పొందడంలో రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదన్నారు. సభలో ఈ విషయంపై చర్చించడం కోసం ప్రభుత్వం 2 గంటలు కేటాయించిందని, చర్చ జరిగితే విషయాలు ప్రజలకు తెలిసేవన్నారు. దురదృష్టవశాత్తూ సభ్యులు వెల్‌లోకి వెళ్లడంతో ఇతర సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ‘ఈ ఆర్డినెన్స్‌ను 18వ తేదీలోగా రెండు సభలు ఆమోదించి రాష్ట్రపతికి పంపాల్సి ఉంది. కాంగ్రెస్ సభ్యులు దీన్ని విమర్శించడం విడ్డూరం. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత తమను సంప్రదించకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారన్న వాదన సరికాదు. ఉమ్మడి రాష్ట్రం ఉండగానే నిర్ణయం జరిగిపోయింది. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం, తగిన నష్టపరిహారం బాధ్యతలను కేంద్రం చేపట్టే ఉద్దేశంతో ఏపీకి బదిలీ చేసింది. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలుపుతున్నారన్న భావన సరైంది కాదు. సోనియా కూడా ఈ ప్రాజెక్టును త్వరిత గతిన ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాశారు. ఆ ఉత్తరం కూడా నేను ఇస్తాను. అడ్డంకులు తొలగిస్తానని అప్పటి ప్రధాని కూడా చెప్పారు’ అని వెంకయ్య అన్నారు. -
'ఆపార్టీ నేతలే వ్యతిరేకించటం హాస్యాస్పదం'
పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు ముందే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 1956కు ముందు ముంపు మండలాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన తెలంగాణ నేతలకు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అలాంటిది ఆ పార్టీ నేతలే వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి ఈ సందర్బంగా వెంకయ్య గుర్తు చేశారు. పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని ఆయన స్సష్టం చేశారు. పోలవరం బిల్లుపై మరింత లోతైన చర్చ జరిగితే బాగుండేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. -
రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే: వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిని ఫలానా చోట ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిశా నిర్దేశం చేయబోదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను అందజేసినా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారని, ఇది తానొక్కడినే నిర్ణయించే అంశం కాదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న విద్యుత్ ఒప్పందాల వివాదం విషయంపై కేంద్ర మంత్రి స్థానంలో ఉండి తాను మాట్లాడబోనని, జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా కేంద్రమే జోక్యం చేసుకుంటుందని తెలిపారు. చార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకుంటారు.. మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, యూపీఏలు రైల్వే చార్జీల పెంపును బలవంతంగా తమపై రుద్దాయని వెంకయ్య విమర్శించారు. రైల్వే చార్జీలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున మొదటిసారి ఎన్నికైన సభ్యులకు ఈ నెల 28, 29 తేదీలలో సూరజ్‌కుండ్‌లో పార్లమెంట్ వ్యవహారాలపై శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వెంకయ్య చెప్పారు. -
వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి: వెంకయ్య
సాక్షి, బెంగళూరు: రాజకీయ నియామకాల్లో భాగంగా గవర్నర్లు అయిన వారందరూ వ్యవస్థ ప్రయోజనాలరీత్యా పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హితవు పలికారు. అది వారికే హుందాగా ఉంటుందని సూచించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మెట్రో రైలు పనులను సమీక్షించాక విలేకరులతో మాట్లాడుతూ ‘గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్ల రాజీనామాకు మా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందనడం సత్యదూరం. అలా రాజీనామా చేయని వారిపై వివిధ కేసులకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేయించనున్నామని వెలువడుతున్న వార్తల్లో కూడా నిజం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది’ అని వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి: ప్రకాశ్ జవదేకర్ కొచ్చి: రాష్ట్రాల గవర్నర్ల మార్పు విషయంలో తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరిస్తుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే అదే సమయంలో గవర్నర్లు, ఇతర రాజకీయ కారణాలతో నియమితులైన వారు వారి మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. -
వెంకయ్యకు బ్రహ్మరథం
- అందరూ మిత్రులే - ప్రాంతీయ భాషల్ని గౌరవిస్తాం - జంప్ జిలానీలొద్దు... - యువత రావాలని పిలుపు సాక్షి, చెన్నై : కేంద్ర మంత్రిగా తొలిసారి చెన్నైలో అడుగుపెట్టిన ఎం.వెంకయ్యనాయుడుకు కమలనాథులు బ్రహ్మరథం పట్టారు. మీనంబాక్కం విమానాశ్రయంలో, పార్టీ కార్యాలయం కమలాలయంలో ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు అన్ని రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా మెలిగేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రాంతీయ భాషలకు గౌరవం ఇస్తున్నామని, ఆ భాషల మీద మరో భాషను రుద్దే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. తొలిసారిగా కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు చెన్నైకు శుక్రవారం వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని కమలనాథులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. కమలాలయం వద్ద పార్టీ వర్గాలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. హుందాగా వ్యవహరించాలి తమ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని గుర్తుచేస్తూ, ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ మారు వారు పరిశీలన చేసుకోవాలని హితవు పలికా రు. గతంలో ఎన్డీఏ నియమించిన గవర్నర్‌లోని అధికారంలోకి రాగానే, యూపీఏ తప్పించిందని గుర్తుచేశారు. అయితే తాము రాజీనామ చేయాలని అడగక ముందే కాంగ్రెస్ రాజకీయం చేస్తుండడం శోచనీయమన్నారు. రాజకీయంగా పదవులు పొందిన వాళ్లు ప్రభుత్వం మారగానే, వాళ్లంతకు వాళ్లు రాజీనామాలు చేసి వెళ్లడం సంప్రదాయం అని, అలా చేసి తమ హుందాతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నియమించిన గవర్నర్లకు సూచించారు. తమిళనాడులో బీజేపి బలం పెరిగిందన్నారు. తమిళనాడులో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టనున్నామన్నారు. ప్రాంతీయ భాషలకు గౌరవం హిందీని రుద్దేయత్నం చేస్తున్నామని కొన్ని పార్టీలు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో యూపీఏ ఇచ్చిన ఉత్తర్వుల్ని తాము ఇచ్చినట్టుగా చెబుతున్నారంటూ మండి పడ్డారు. అయితే ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులు లేవని వివరించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలకు హిందీ ప్రాధాన్యత ఇవ్వాలని ఉందేగానీ, ఇతర భాషల మీద రుద్దాలని లేదని పేర్కొన్నారు. హిందీని ఇతర భాషల మీద రుద్దాలన్న సిద్ధాంత బీజేపీలో లేదని పేర్కొంటూ, తాము ప్రాంతీయ భాషలకు గౌరవాన్ని ఇస్తున్నామన్నారు. ఇలగణేషన్, చక్రవర్తి, వానతీ శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాకు అన్ని పూర్తి
జాతీయ అభివృద్ధి మండలి ఆమోదమే మిగిలింది విద్య, వైద్య, సాంకేతిక వైజ్ఞానిక సంస్థలన్నీ ఆంధ్రాకు ఇస్తాం: వెంకయ్యనాయుడు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాకు జాతీయ అభివృద్ధి మండలి మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఆందోళన చెందాల్సిన పనేలేదన్నారు. ప్రత్యేక హోదా నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని చెప్పారు. రాష్ట్ర విభజనను ఆంధ్ర ప్రజలు కోరుకోలేదని, అయినా విభజన జరిగిపోయిందని గుర్తుచేశారు. విడిపోయిన తెలంగాణలో విద్య, వైద్య, సాంకేతిక వైజ్ఞానిక సంస్థలన్నీ ఉన్నాయని, ఆంధ్రాలో అలాంటివేమీ లేనందునే ప్రత్యేక హోదాకు పట్టుబట్టామని చెప్పారు. హైదరాబాద్‌లోనే పేరొందిన అన్ని సంస్థలు ఉన్నాయని, ఆ లోటును భర్తీ చేసేందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వం అప్పుడే సాంకేతిక సమస్యలన్నీ తొలగించి ఉంటే ఇప్పుడీ సమస్య, గందరగోళం, అనుమానాలు ఉండేవికాదన్నారు. విభజన వల్ల కలిగిన ఆర్థికలోటును ఏడాది పాటు కేంద్ర బడ్జెట్ నుంచే విడుదల చేస్తామని ఇందులో కూడా అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సందేహాలు, పునరాలోచన అక్కర్లేదన్నారు. హైదరాబాద్‌కు సమాంతరంగా అన్ని విద్య, వైజ్ఞానిక సంస్థలన్నీ ఆంధ్రాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏయే ప్రాజెక్టులు అంశాల వారీగా రావాలో సంబంధిత కేంద్ర మంత్రులందరికీ లేఖలు రాశానని, అవన్నీ త్వరలోనే కార్యరూపంలోకి వస్తాయని తెలిపారు. ప్రతిపక్షాలకు ఒక్కటే చెబుతున్నా.. ‘ప్రతిపక్షాలకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. హుందాగా వ్యవహరించ ండి. ప్రజా తీర్పును కొన్నాళ్లయినా గౌరవించండి. మీ పరిస్థితి చూస్తుంటే ప్రజా సందేశాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు లేరు. అందుకే కొన్నిచోట్ల ఆందోళనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తే కరెంట్ వస్తుందా..’ అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 రోజులైనా కాలేదు.. ఇన్నేళ్లూ మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు ఇవ్వలేని కరెంట్ తాము 10 రోజుల్లో ఎలా ఇవ్వగలమో విజ్ఞతతో ఆలోచించాలి..’ అని సూచించారు. గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తామని, సీమాంధ్రలో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుకు అధికారుల నిర్ణయమే అంతిమమని చెప్పారు. జోన్ ఎక్కడ వచ్చినా ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుందన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉండేలా సీఆర్‌జెడ్ నిబంధనలను సవరిస్తామని ప్రకటించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు, ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్‌రావు, కార్యవర్గసభ్యుడు చెరువు రామకోటయ్య, నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు పాల్గొన్నారు. వాకర్స్‌తో వెంకయ్య ముచ్చట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఆదివారం ఉదయం వాకింగ్ చేశారు. చదువుకునే రోజుల్లో ఇదే బీచ్‌లో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవాడినని తోటి వాకర్స్‌తో కొద్దిసేపు తన పాతరోజులను గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. విశాఖపట్నం లోక్‌సభ నుంచి హరిబాబును గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖలో ఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎంపీ హరిబాబు, బీజేపీ నగర అధ్యక్షుడు నారాయణరావు, పార్టీ నాయకులు ఆయనతో వాకింగ్‌లో పాల్గొన్నారు. -
ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి ఢోకా లేదు
అభినందన సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విశాఖపట్నం: సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రత్యేక హోదాకు ప్రణాళికా సంఘం ఆమోదం లేదనడం సరికాదన్నారు. ప్రణాళికా సంఘ ఛైర్మన్ గా ప్రధానమంత్రి మోడీ వ్యవహరిస్తారని, ఆయనే ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించడం వల్ల ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ ద్దని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శనివారం విశాఖ వచ్చిన ఆయన్ని బీజేపీ నగరశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రణాళికా సంఘం సలహా సభ్యులు సంబంధిత మంత్రికి కేవలం ప్రత్యేక హోదా ఎలా ఇస్తారనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చారని, ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఉండాల్సిన పరిధి, నియమ నిబంధనలు వివరించారని చెప్పారు. ఈ నిబంధనలన్నీ సీమాంధ్రకు లేవంటూ మీడియాలో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఉంటుందని, ఆ కాలంలో విస్తారంగా భారీ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. సీమాంధ్రకు రాజధానిగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నందున రైల్వే జోన్ కేంద్రంగా విశాఖను చేస్తామని ప్రకటించారు. ఐఐఎం ఓ చోట, ఐఐటీ మరో చోట ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, శంకరంపల్లిలో విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేయాలని లేఖలు రాశానన్నారు. -
ఆలస్యంగా వస్తానని ముండే అనుమతి అడిగారు..
న్యూఢిల్లీ: అంత సవ్యంగా జరిగితే బుధవారం పార్లమెంట్ లో గోపినాథ్ ముండే ప్రమాణ స్వీకారం జరిగాల్సి ఉండేది. కాని విధి వక్రీకరించి.. మరోలా జరిగింది. పార్లమెంట్ లో జరిగే లోకసభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆలస్యంగా వస్తానని అనుమతి తీసుకున్నారని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. నియోజకవర్గ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున్న కాస్తా ఆలస్యం అవుతుందని తనతో అన్నారని వెంకయ్య మీడియాకు వెల్లడించారు. నా అనుమతి కోరారు. నేను ఓకే అన్నాను. కాని ఆయన ఇప్పడు మనతో లేరు.. అని వెంకయ్య ఉద్వేగానికి లోనయ్యారు. గతరాత్రి తనతో మాట్లాడిన ముండే.. మంగళవారం ఉదయమే ప్రమాదంలో కన్నుమూయడం వెంకయ్యను దిగ్భాంతికి గురి చేసింది. -
రాబర్డ్ వాద్రాపై ప్రతీకార చర్యలుండవు: వెంకయ్య
బెంగళూరు: రాజకీయ ప్రత్యర్ధులపై ఎన్ డీఏ ప్రభుత్వం ఎలాంటి పగసాధింపు చర్యలుండవని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్ధులైన సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలాంటి వ్యక్తులపై ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టబోమని ఆయన అన్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఎలాంటి దాడులు చేయబోమని... హర్యానా, రాజస్థాన్ లోని వివాదస్పద భూకేటాయింపులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో యూపీఏ ప్రభుత్వంలో వాద్రా కు కేటాయించిన భూకేటాయింపులపై బీజేపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
కేబినెట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు: వెంకయ్య
న్యూఢిల్లీ: తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులేస్తోంది. కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రధాన పాత్ర ఉంటుందనే వార్తలను బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ఖండించారు. కేంద్ర కేబినెట్ లో ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర పోషించడం లేదంటూ వెంకయ్య విరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ నేతలను కలువడంలో ఎలాంటి విశేషం లేదు. ఎప్పుటిలానే ఆర్ఎస్ఎస్ ను కలిశాం. కేబినేట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు అని వెంకయ్యనాయుడు మీడియాకు వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. -
ఏ హోదాలో మోడీని విమర్శిస్తున్నారు?
ప్రియాంకపై వెంకయ్య ధ్వజం సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో ఏ హోదాతో ప్రియాంక వాద్రా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని విమర్శిస్తున్నారని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నరేంద్రమోడీపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఆయన ఆదివారం విజయవాడలో ఒక హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో మోడీ గాలి వీస్తోందని.. కాంగ్రెస్‌కు సెలవు చీటీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి సల్మాన్‌ఖుర్షీద్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్చౌహాన్లు అవసరమైతే తృతీయ ప్రత్యామ్నాయంతో కలుస్తామని చెప్పడాన్నిబట్టే.. వాళ్లు గెలవ లేరని తేలుతోందని వెంకయ్య ఎద్దేవా చేశారు. -
మేం మద్దతివ్వకుంటే బిల్లు పాసయ్యేదే కాదు
తెలంగాణపై వెంకయ్యనాయుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వల్లనే ఆలస్యమైంది హైదరాబాద్: పార్లమెంట్లో బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదే కాదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాష్ట్ర ఏర్పాటు ఇంత ఆలస్యం కావడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే బాధ్యత తీసుకోవాలన్నారు. ఉద్యమంలో ఈ ప్రాంత యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికీ ఆ రెండు పార్టీలు కారణమని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించడంవల్లే కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లు కాలయాపన చేసి ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ముందుకొచ్చిందని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి జైరాంరమేష్ తెలంగాణ బిల్లు చర్చ జరిగే సమయంలో ఎనిమిదిసార్లు తనను ఎందుకు కలవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరడం తన తప్పా? అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబులది అపవిత్ర కలయిక అంటున్నారు గానీ, చంద్రబాబు కింద తానేమీ పని చేయలేదు, మీరే ఆయన కింద పనిచేశారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పడు తనపై విమర్శలు చేస్తున్న ఈయనే 2009లో ఎన్డీయేతో కలిసేందుకు తన ఇంటికి వచ్చారని చెప్పారు. ఈ ప్రాంతం వారే ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటారు కానీ, వలస వచ్చిన వాళ్లను సీఎం కావడానికి అంగీకరించరని వ్యాఖ్యానించారు. ఎవరు వసూళ్ల రాజానో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. హుందాగా వ్యవహరించాలని, కుల ప్రస్తావన మానుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఆపేశక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటిస్తారనుకుంటున్నా సీమాంధ్ర ప్రాంతంలో పొత్తుల్లో బీజేపీకి కేటాయించిన సీట్లలో మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిపిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తనతో చెప్పారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పొత్తు నిర్ణయం సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని.. పొత్తు ధర్మాన్ని పాటిస్తారని అనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి సీమాంధ్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. -
మా పొత్తు చారిత్రక అవసరం: వెంకయ్య
చిత్తూరు టీడీపీ, బీజేపీ పొత్తు చారిత్రక అవసరమని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాజంపేట లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి శనివారం చిత్తూరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తు ఎంతైనా అవసరమన్నారు. అనివార్య కారణాలతో రెండు పార్టీల మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడిన మాట వాస్తవమేనని చెప్పారు. కొంతమంది నాలుగో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, టెంట్ వేసినంత సులభంగా ఫ్రంట్లను ఏర్పాటు చేయలేరని ఎద్దేవా చేశారు. -
సమస్యలపై సమాధానమేది?
తెలంగాణ, సీమాంధ్రలో మెజారిటీ స్థానాలు మావే ఎన్డీఏకు 300 సీట్లు ఖాయమని ధీమా ఎన్నికల అనంతర పొత్తులకు వ్యతిరేకం కాదు సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపికపై నేడు చర్చ సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పాలనా వైఫల్యం, నమ్మక ద్రోహంపై సమాధానం చెప్పకుండా తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ కాంగ్రెస్ తన స్వభావాన్ని చాటుకుంటోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు మండిపడ్డారు. వ్యక్తిగత అంశాలపై చర్చించాల్సి వస్తే కాంగ్రెస్ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ వివాహాన్ని గోప్యంగా ఉంచారంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా... ‘వివాహ విషయాన్ని మోడీ ఎప్పుడూ రహస్యంగా పెట్టలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్లో పేర్కొన్నారు. బాల్య వివాహం జరిగిన తర్వాత ఆయన జీవితాన్ని పార్టీ, దేశానికి అంకితమిచ్చారు. ఇరు కుటుంబాల వారికీ ఈ విషయం తెలుసు. ఇలాంటి వాటిపై కాంగ్రెస్ చర్చించవద్దు. కాంగ్రెస్‌కు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి’ అని వెంకయ్య బదులిచ్చారు. దేశానికి, ప్రజాప్రయోజనాలకు హాని కలిగే ప్రమాదముంటేనే వ్యక్తిగత విషయాలపై చర్చించాలన్నారు. మోడీ రాజధర్మాన్ని పాటిస్తున్నారన్నారు. రెబెల్స్‌ను సముదాయిస్తున్నాం: తెలంగాణలో కొన్ని చోట్ల రెండు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారని, వారిని సముదాయించి ఉపసంహరించే ప్రయత్నం చేస్తున్నామని వెంకయ్య తెలిపారు. అది పూర్తయ్యాక తెలంగాణలో స్పష్టత వస్తుందన్నారు. సీమాంధ్రలో శనివారం ఎన్నికల కమిటీ భేటీ కానుందని, ఆ కమిటీ సిఫార్సు చేసే పేర్లను కేంద్ర కమిటీ ఒక రోజులోనే ఆమోదిస్తుందని పేర్కొన్నారు. సీమాంధ్ర, తెలంగాణలో మోడీ సభలను ఏర్పాటు చేస్తామని, పార్టీ అగ్రనేత అద్వానీ, సుష్మా తదితర నేతలు కూడా హజరవుతారని చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పొత్తులు పార్టీల మధ్య తప్పితే వ్యక్తుల మధ్య కాదని, బీజేపీ-టీడీపీల మధ్య పొత్తును వ్యక్తులకు ఆపాదించడం సరికాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణలో సుస్థిరతే లేదని, అలాంటిది తమ కూటమితో అస్థిరత ఎలా వస్తుందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా 250కి పైగా స్థానాల్లో గెలుస్తుందని, మిత్రులతో కలిసి 300 స్థానాలు ఖాయమని, దక్షిణాది రాష్ట్రాల్లో 50 సీట్లు వస్తాయని వెంకయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతర పొత్తులకు అవసరం ఉండకపోవచ్చునని, అయితే అందుకు తాము వ్యతిరేకం కాదని వెంకయ్య తెలిపారు. ప్రస్తుతానికైతే పార్టీలో అలాంటి చర్చలేమీ జరగడం లేద ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ ఎంతో వెనుకబడిపోయిందన్నారు. -
రాజంపేట వద్దు.. ఒంగోలు ఇవ్వండి
టీడీపీని కోరుతున్న బీజేపీ హైదరాబాద్: సీమాంధ్రలో బీజేపీ, టీడీపీల పొత్తులో సీట్ల సంఖ్యపై అవగాహన కుదిరినప్పటికీ, ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలన్న అంశం పీటముడిగా మారింది. తమకు కేటాయించిన అరకు లోక్‌సభ స్థానం కాకుండా కాకినాడ, రాజంపేట స్థానంలో ఒంగోలు కేటాయించాలని టీడీపీకి బీజేపీ ప్రతిపాదించింది. కనీసం ఈ రెండింటిలో ఒక్కచోట అయినా మార్పు చేయాలని కోరుతోంది. పొత్తుల్లో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ఖరారు చేయడానికి బీజేపీ సీమాంధ్ర శాఖ ముఖ్య నేతలు సోమవారం విజయవాడలో సమావేశమయ్యారు. పార్టీ సీమాంధ్ర శాఖ ప్రతిపాదనలపై పార్టీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిలతో హైదరాబాద్‌లో చర్చలు జరిపారు. ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని ఎక్కడి నుంచి బరిలోకి దించాలన్న విషయంపై పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఆమె కోసం ఒంగోలు సీటు కావాలని బీజేపీ ప్రతిపాదించింది. అందుకు రాజంపేట స్థానాన్ని వదులుకుంటామని చెబుతోంది. -
చీటర్లు, లూటర్లెవరో ప్రజలు తేలుస్తారు
రాష్ట్ర విభజన వ్యవహారంలో చీటర్లు (మోసగాళ్లు), లూటర్లు (దోపిడీదారులు) ఎవరో ప్రజలే తేలుస్తారని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సాఫీగా, ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పడమే పాపమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలంటూనే సీమాంధ్ర సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావించడం నేరమా? అన్నారు. ప్రాంతానికో మాట మాట్లాడి, పూటకో డ్రామా అడిన వారి సంగతేమిటో తేల్చే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని ప్రధానిని చేసేందుకు బీజేపీకి, ఆ పార్టీ మద్దతుదార్లకు (వారెవ్వరో స్పష్టంగా చెప్పలేదు) ఓటేయాలని అభ్యర్థించారు. ‘మోడీని ప్రధానిని చేద్దాం’ నినాదంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో డాక్టర్ రామారావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యతో పాటు బీజేపీ జాతీయ కోశాధికారి పీయుష్ గోయల్, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఉభయ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కె.హరిబాబు, జి.కిషన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎన్.రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నరేంద్ర మోడీపై రాసిన పాటల క్యాసెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... 2009లో చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కల్పించిందని, దాని కొనసాగింపుగా జరిగిన ఉద్యమంలో వేయి మందికి పైగా అమరులయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2014 సాధారణ ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయమే రెండేళ్ల కిందటే తీసుకొని ఉంటే ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉండేది కాదన్నారు. విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంలో తమ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, అద్వానీలతో పాటు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ సమయంలో ఏమి చేయాలని నాలుగు రోజులు నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. తెలంగాణ రావాలి, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలనడం ఏవిధంగా ద్రోహమో చెప్పాలన్నారు. బాగో, జాగో అంటూ సీమాంధ్రుల్లో భయాందోళనలు సృష్టించారని, వాటిని పారదోలేందుకు ప్రధానితో ప్రకటన చేయించిన ఏకైక వ్యక్తిని తానేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను గానీ, తన కుమార్తె గానీ పోటీ చేయబోమని ప్రకటించారు. కొందరు మళ్లీ రాష్ట్రాన్ని కలుపుతామనడంపై స్పందిస్తూ, ఇదేమైనా పాతాళ భైరవి సినిమానా? అని ఎద్దేవా చేశారు. పీయుష్ గోయల్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రధానైతే పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. హైదరాబాద్‌కు మజ్లిస్ పార్టీయే ప్రధాన సమస్యని కిషన్‌రెడ్డి అన్నారు. హరిబాబు మాట్లాడుతూ సీమాంధ్రకు ప్యాకేజీ బీజేపీ కృషేనని చెప్పారు. -
అధికారంలోకొస్తే.. సిమకు పెద్దపీట
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అనంతపురం ఆర్ట్స కళాశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ‘మోడీ ఫర్ పీఎం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హంద్రీ నీవా, గాలేరు నగరి, పోలవరం, ప్రాజెక్టులకు జీవం పోస్తామన్నారు. సీమలో అగ్రికల్చర్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మణీ స్టీల్స్ ఏర్పాటు, సమాంతర కాలువ సాధనకు కృషి చేస్తామన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు పెద్దపీట వేస్తామన్నారు. కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని ఆయన ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో అవినీతికి అందలం.. ధరల పెరుగుదల.. కుమ్ములాటలు.. ప్రజా జీవనం చిన్నాభిన్నం చేసి స్వార్థపరుల జేబు సంస్థగా మారి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ కూడా ఒక పార్టీయేనా అంటూ విమర్శించారు. దేశంలోనే అత్యంత వీకెస్ట్ ప్రధాని మన్మోహన్ సింగ్, వీకెస్ట్ రాజకీయ నేత సోనియాగాంధీ అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలో అలజడులు సృష్టిస్తున్నా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు. నల్లధనాన్ని విదేశాల్లో దాచుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో యూపీఏ ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ విముక్త దేశానికి కంకణబద్ధులు కావాలని, బీజేపీని ఆదరించాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. థర్డ్‌ఫ్రంట్ పెట్టాలని ప్రయత్నిస్తున్న కమ్యూనిస్టులను నమ్ముకుంటే కొంపలు మునుగుతాయన్నారు. కమ్యూనిస్టుల్లో ఐక్యత సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారింద ని, నరేంద్ర మోడీ ప్రధాని కావాలనే నినాదం ప్రజ్వరిల్లుతోందన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్తా నడుం బిగించాలన్నారు. ప్రతి కార్యకర్తా వంద మందిని ఓటర్లుగా చేర్పించాలన్నారు. అనంతరం పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. సభలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, బీజేపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవీందర్‌రాజు, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్ పార్థసారథి, జాతీయ నాయకులు శాంతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు మందరపు రమణ, రత్నమయ్య, ఫయాజ్, మల్లారెడ్డి, లలిత్‌కుమార్, ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. చాయ్ తాగండి..! ‘నమో చాయ్’ కార్యక్రమంలో భాగంగా వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం డీఈఓ కార్యాలయ సమీపంలోని గెలాక్సీ టీస్టాల్ నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు, ప్రజలకు తానే స్వయంగా టీ ఇచ్చారు. దేశాన్ని అమ్మే కాంగ్రెస్ పార్టీ కంటే.. టీ అమ్ముకునే వాడే నయమని అన్నారు. మోడీ సైతం టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చి నేడు ప్రధాని రేసులో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్టీ చౌదరికి భంగపాటు! టీడీపీ మాజీ నేత ఎన్టీ చౌదరికి పరాభవం ఎదురైంది. టీకొట్టు వద్ద వెంకయ్యనాయుడు టీ ఇస్తుండగా.. పలువురు బీజేపీ నాయకులు వెంకయ్య పక్కన నిలబడ్డారు. అయితే ఎన్టీ చౌదరిని మాత్రం ఆహ్వానించలేదు. చివరికి ఆయన అనుచరులే అన్నా.. నువ్వు ముందుకుపో అంటూ వెంకయ్యనాయుడు వద్దకు పంపారు. సభలో కూడా అంత ప్రాధాన్యత కల్పించలేదన్న విమర్శలు వినిపించాయి. ‘సమైక్య’ సెగ అనంతపురంలో ఆదివారం బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడుకు ‘సమైక్య’ సెగ తగిలింది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. పలు విద్యార్థి సంఘాల నాయకులు, సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర.. అంటూ నినదిస్తూ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని పక్కకు నెట్టారు. ‘వాళ్లు మామూలే.. ఫొటోలకు ఫోజులు ఇస్తుంటారు.. అవేమీ పట్టించుకోకండి’ అంటూ వెంకయ్యనాయుడు సమైక్యవాదులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో సమైక్యవాదులు మళ్లీ నినాదాలు చేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. -
కాంగ్రెస్‌కు మోడీ అంటే ....
గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పేరు వింటేనే కాంగ్రెస్ పార్టీ వణుకుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. అందుకే మోడీ పేరు వినగానే ఆ పార్టీ అదుపు (బ్యాలెన్స్) కోల్పోయి మాట్లాడుతుందని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... గతంలో వాజ్పాయ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా దేశంలో ధరలు అదుపులో ఉండేవని, అలాగే రైతులు, మహిళలు సంతోషంగా ఉండేవారని ఆయన గుర్తు చేశారు. అయితే యూపీఏ పాలనలో అందుకు విరుద్ధంగా జరుగుతుందని తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉండగా దేశ అర్థికాభివృద్ధి 8.4 శాతానికి తీసుకువచ్చిందని, ఆ తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన యూపీఏ ఆ శాతాన్ని 4.4 తీసుకువచ్చిందని ఆరోపించారు. 2004లో దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని గతంలో కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రశంసించారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. దేశ అర్థిక వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని చిదంబరం విమర్శించడం ఎంతవరకు సమంజసం అని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా చిదంబరాన్ని ప్రశ్నించారు. -
ఎన్నికల కోసం బీజేపీ ‘వార్’ రూమ్
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాల సమన్వయం కోసం బీజేపీ ‘వార్’ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీన్ని సోమవారం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ నాయకత్వంలో ఈ కేంద్రం రోజుకు 24 గంటలూ పనిచేస్తుంది. బీజేపీకి ఇదే తొలి వార్ రూం. కాంగ్రెస్ ఇప్పటికే నగరంలో ఇలాంటి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కాగా, యూపీఏ సర్కారు పాలనలో ధరల పెరుగుదల, కుంభకోణాలపై ప్రచార పుస్తకాలను వెంకయ్య.. వార్ రూమ్ ప్రారంభ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పార్టీ నేతలు ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కిరణ్‌పై చర్యలేవీ? జవదేకర్ ఆంధ్రప్రదేశ్ విభజనపై సంప్రదాయాలను పాటించాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు పంపి క్రమశిక్షణను ఉల్లంఘించిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రకాశ్ జవదేకర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సొంత పార్టీ సీఎం లేఖలు పంపినా చర్యలు తీసుకునేవారే లేరని, కాంగ్రెస్ సంస్కృతికి ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని పునరుద్ఘాటించారు. -
వెంకయ్యా.. ఇదేం బాగా లేదయ్యా!
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తులు, సర్దుబాట్లపై బీజేపీలో కలకలం మొదలైంది. కోర్ కమిటీ సమావేశానికి చివరి క్షణంలో హాజరైన పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడుపై పార్టీ రాష్ట్ర నేతలు ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ ఎన్నికల వ్యూహం, సీమాంధ్ర ఉద్యమం, సంస్థాగత వ్యవహారాలు, కీలక నియోజకవర్గాల గుర్తింపు తదితర అంశాలను చర్చించేందుకు కోర్ కమిటీ బుధవారమిక్కడి గుజరాత్ భవన్లో సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సతీష్ జీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఎక్కా శేఖర్, శ్యాంజీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, వెంకయ్య నాయుడు, కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. టీడీపీతో గతంలో పొత్తు, గెలిచిన సీట్లు, ప్రస్తుత పరిస్థితి గురించి భేటీలో చర్చ సందర్భంగా.. వెంకయ్యపై పార్టీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేత సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ‘‘ఎవరెవరో ఏమోమో మాట్లాడుతున్నారు. లేనిపోనివన్నీ అంటున్నారు. తెలంగాణలో అనేక మంది ఇతర పార్టీల వారు వచ్చి చేరతారని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవ్వరూ చేరినట్టు కనిపించడం లేదు’’ అని వెంకయ్య నాయుడు అనడంతో యెండల తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు మీరేం మాట్లాడుతున్నారు? పొత్తులుండవని సుష్మాస్వరాజ్ పాలమూరులో చెప్పిన మర్నాడే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని సంకేతం ఇచ్చేలా మీరు బెంగళూరులో మీడియాతో చెప్పారు. మీరు చేసే పని వల్లే లేనిపోని అపోహలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఏమున్నదని చంద్రబాబుతో పొత్తంటున్నారు? టీడీపీతో పొత్తనే ఉహాగానాలు రావడంతోనే వచ్చే వాళ్లందరూ వెనక్కుపోయారు. చివరకు పంచాయతీ సర్పంచులు కూడా పార్టీలో చేరడానికి వెనకాముందాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డట్టు తెలిసింది. ఇదే సమయంలో వీర్రాజు జోక్యం చేసుకుంటూ.. సీమాంధ్రలో మాత్రం పొత్తు కావాలని ఎవరు కోరారని వెంకయ్యను నిలదీశారు. ‘‘చంద్రబాబుతో పొత్తని ఎవరు డిసైడ్ (నిర్ణయం) చేశారు. ఇందులో మా పాత్ర ఏమీ ఉండదా? దీనిపై పెద్ద నేతలెవ్వరూ స్పష్టత ఇవ్వరా?’’ అని ప్రశ్నించారు. తర్వాత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పొత్తులుండవని రాజ్‌నాథ్ సింగ్ కూడా తనకు చెప్పారని, అవసరమైతే ఢిల్లీలో ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టి తనతో పాటు కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ దశలో వెంకయ్యనాయుడు సమావేశం నుంచి నిష్ర్కమించినట్టు తెలిసింది. అనంతరం పార్టీ నేతలు, కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ప్రాంత పదాధికారులతో భేటీ అయ్యారు. సాయంత్రం ఆర్ఎస్ఎస్ ఆంధ్రాప్రాంత నేతలతో సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు బీజేపీ తెలంగాణ పదాధికారుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ ప్రాంత పదాధికారులు తేల్చిచెప్పారు. తెలంగాణలో పార్టీని, కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీ ఈ వదంతులను సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యమం, తెలంగాణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి సమర్పించాల్సిన నివేదిక, సంస్థాగత నిర్మాణం, తెలంగాణ బిల్లు తదితర అంశాలను చర్చించేందుకు పార్టీ ఉద్యమ కమిటీ నేతలు, తెలంగాణ ప్రాంత పథాధికారులు బుధవారమిక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉద్యమ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సతీష్జీ, ఆర్ఎస్ఎస్ బాధ్యులు రామచంద్రరాజు తదితరులు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్ యాదవ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ స్థాయిలో టీడీపీతో పొత్తు కుదిరిందన్న ప్రచారంలో వాస్తవం లేదని యెండల స్పష్టంచేశారు. నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్తామన్నారు.