బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల... | Awarded Business Excellence Awards | Sakshi
Sakshi News home page

బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల...

Published Sun, Sep 7 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల...

బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల...

కొరుక్కుపేట(చెన్నై):  చెన్నైలో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ 87వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డులను అందజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ప్రదానం చేశారు.  అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డిని, కేఆర్‌ఎస్‌ఎంఏ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) డెరైక్టర్ ఉమా చిగురుపాటిలను బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డులతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఘనంగా సత్కరించారు.

తమతమ రంగాల్లో సేవలందిస్తున్న డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, ఉమా చిగురుపాటి యువతకు ఆదర్శనీయులని అన్నారు.  వీరితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఎస్.సీతారామయ్య, శైలేష్ ఆర్.మెహతా, డాక్టర్ జేఏఎస్.గిరిలను సత్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 1928 లో ఏర్పడిన ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ 86 ఏళ్లు పూర్తి చేసుకుని 87వ వసంతంలోకి అడుగిడటం సం తోషకరమన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం మెడికల్ హబ్‌గా అవతరించబోతోందని చెప్పారు. ఆంధ్రా కామర్స్ అధ్యక్షురాలు వీఎల్ ఇందిరాదత్తు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement