ఆలస్యంగా వస్తానని ముండే అనుమతి అడిగారు..
న్యూఢిల్లీ: అంత సవ్యంగా జరిగితే బుధవారం పార్లమెంట్ లో గోపినాథ్ ముండే ప్రమాణ స్వీకారం జరిగాల్సి ఉండేది. కాని విధి వక్రీకరించి.. మరోలా జరిగింది.
పార్లమెంట్ లో జరిగే లోకసభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆలస్యంగా వస్తానని అనుమతి తీసుకున్నారని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు.
నియోజకవర్గ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున్న కాస్తా ఆలస్యం అవుతుందని తనతో అన్నారని వెంకయ్య మీడియాకు వెల్లడించారు.
నా అనుమతి కోరారు. నేను ఓకే అన్నాను. కాని ఆయన ఇప్పడు మనతో లేరు.. అని వెంకయ్య ఉద్వేగానికి లోనయ్యారు. గతరాత్రి తనతో మాట్లాడిన ముండే.. మంగళవారం ఉదయమే ప్రమాదంలో కన్నుమూయడం వెంకయ్యను దిగ్భాంతికి గురి చేసింది.